SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Rgv Comments On Delhi Shraddha Walker Incident

ఢిల్లీ శ్రద్దా వాకర్ ఉదంతంపై స్పందించిన RGV.. అతడిని 70 ముక్కలు చేయాలి!

  • Written By: Govardhan Reddy
  • Updated On - Wed - 16 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఢిల్లీ శ్రద్దా వాకర్ ఉదంతంపై స్పందించిన RGV.. అతడిని 70 ముక్కలు చేయాలి!

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్యకేసులో దర్యాప్తు కొనసాగుతోంది. తనను నమ్మి వచ్చిన ప్రియురాల్ని చంపి 35 ముక్కలుగా కోసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరి అత్యంత కిరాతకానికి ఒడిగట్టిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా(28)ను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అతడి నుంచి కీలక ఆధారాలు రాబెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, అతడు పొంతనలేని సమాధానాలతో పోలీసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ఉదంతంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు.

పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినందుకు తన ప్రియురాలిని హత్యచేసి, 35 ముక్కలు చేసిన ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలెన్నో బయటకొస్తున్నాయి. తాను పలు క్రైం వెబ్ సిరీసులు చూసేవాడినని, అమెరికా టీవీ సీరియల్ ‘డెక్స్ట్రర్’ స్ఫూర్తితో శ్రద్ధాను ముక్కలుగా నరికేశానని నిందితుడు విచారణలో వెల్లడించాడు. దీనిపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. దేవుడికి వింత అభ్యర్ధన చేశారు.

‘మరణించి ఎక్కడో విశ్రాంతి తీసుకునే బదులు.. ఆత్మగా తిరిగి వచ్చి అతడిని 70 ముక్కలు చేయాలి. ఇలాంటి క్రూరమైన హత్యలను కేవలం చట్ట భయంతో అరికట్టలేము. మృతిచెందినవారి ఆత్మలు తిరిగివచ్చి హంతకులను చంపితే.. వాటిని కచ్చితంగా ఆపవచ్చు. భగవంతుడు దీనిని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను..’ అని ట్వీట్ చేశాడు.

Instead of resting in PEACE she should come back as a spirit and cut him into 70 PIECES

— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022

Brutal murders can’t be prevented just by fear of law ..But they can be definitely stopped if the victims spirits come back from the dead and kill their killers ..I request God to consider this and do the needful 🙏🙏🙏

— Ram Gopal Varma (@RGVzoomin) November 16, 2022

ఈ కేసు పూర్వాపరాలు ఇవే..

మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా, శ్రద్ధా వాకర్ లు మూడేళ్లు సహజీవనం చేశారు. కుటుంబ సభ్యులు వద్దనడంతో వారిద్దరూ ముంబయి నుంచి దిల్లీకి మకాం మార్చారు. తరువాత శ్రద్దా.. తనను పెండ్లి చేసుకోవాలని అఫ్తాబ్‌పై ఒత్తిడి చేస్తూ వస్తోంది. ఈ విషయమై ఇద్దరూ తరచుగా గొడవ పడుతుండేవారు. మే 18న మరోసారి జరిగిన వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకున్నది. ఈ నేపథ్యంలో అఫ్తాబ్ మే 18న ఆమెను గొంతుకోసి చంపాడు. ఆపై శవాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్ లో దాచాడు. 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. శ్రద్ధాకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందనా రాకపోవడంతో ఆమె తండ్రి ఈనెల 8న దిల్లీకి వచ్చి, తన కుమార్తె ఉండే ఇంటికి వెళ్లాడు. అక్కడ తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ముంబైలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేసిన సమయంలో అక్కడ ఆమెకు అఫ్తాబ్‌తో స్నేహం ఏర్పడిందని బాధితురాలి తండ్రి వికాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె నిర్ణయాన్ని కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. ఆమె వినకుండా అఫ్తాబ్‌తో ఢిల్లీ వెళ్లి సహజీవనం చేసింది. ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకుని నివసించేవారు. 2022 మే నెల తర్వాత నుంచి తమ కుమార్తె నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, తమను ఆమె సంప్రదించలేదని తండ్రి వికాస్‌ అందులో వివరించాడు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అఫ్తాబ్‌ ను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Tags :

  • Crime News
  • Delhi
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

  • విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

    విషాదం.. డాక్టర్ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam