దేశంలో రోజుకొక చోట ఆడ పిల్లలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు ఆడపిల్లలకు బయటే రక్షణ లేదని బయపడ్డాం. కానీ రాను రాను ఇంట్లో కూడా ఆడ పిల్లలకు రక్షణ లేకుండపోతుంది. కొందరు వ్యక్తులు అయితే వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ తండ్రి ఏకంగా కన్న కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. అభం, శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడుతూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మండలంలోని ఓ గ్రామంలో ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి గతంలో ఓ మహిళతో వివాహం జరిగి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే వీరి కుటుంబం 6 నెలల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక అక్కడికి చేరుకున్నాక భార్య హోటల్ లో పని చేస్తుండగా, భర్త మాత్రం తన పెద్ద కూతురు (17)ను వెంటబెట్టుకుని పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే తండ్రి కూతురిపై కన్నేశాడు. దీంతో తండ్రి కూతురుని బలవంతం చేసి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇకపోతే ఇటీవల సంక్రాంతి పండగ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లారు.
తండ్రి చేసిన దారుణాన్ని ఆ బాలిక తన నాయనమ్మతో పాటు ఆమె తల్లికి వివరించింది. దీంతో అనుమానం వచ్చి ఆ బాలిక తల్లి వైద్య పరీక్షలు జరిపించగా.. ఆ బాలిక 3 మూడు నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లి, నాయనమ్మ ఒక్కసారిగా షాక్ కు గురైంది. అనంతరం ఆ బాలిక కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక తండ్రిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.