crime news : స్కూలు పిల్లలను ఆటలతో శారీరకంగా గట్టిగా తయారు చేయాల్సిన పీటీ టీచర్ వక్ర బుద్ధి చూపించాడు. ఓ బాలికను తన శారీరక సుఖం కోసం వాడుకున్నాడు. బలవంతంగా రెండు సార్లు అత్యాచారం చేశాడు. భయంతో బాలిక ఎవ్వరికీ చెప్పలేకపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆమె చెల్లెలిపై అదే పీటీ టీచర్ కన్నేశాడు. బలవంతంగా అత్యచారం చేయాలనుకున్నాడు. వేధింపులకు గురి చేశాడు. దీంతో బాలిక ఇంట్లో వాళ్లకు చెప్పింది. చెల్లెలు ధైర్యం చూసి అక్కకు కూడా దైర్యం వచ్చింది. తనపై జరిగిన అత్యాచారాన్ని బయటపెట్టింది. ఈ సంఘటన రాజస్తాన్‌లో ఆదివారం వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాగౌర్ పోలీస్ స్టేషన్ పరిథిలో నివాసం ఉండే ఓ బాలిక అక్కడి ఓ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఆ స్కూల్లో పీటీ టీచర్‌గా పని చేసే 30 ఏళ్ల హరిరామ్ బాలికను ఎవరూలేని గదిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఈ సంఘటన 2018లో జరిగింది. బాలిక పదవ తరగతికి వచ్చిన తర్వాత కూడా ఓ రోజు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన 2019లో జరిగింది. దీంతో భయపడిపోయిన బాలిక చదవటం అపేసింది. మార్చి 5వ తేదీన హరిరామ్ బాలిక చెల్లెల్ని లైంగికంగా వేధించాడు. ఇది ఇంట్లో తెలిసింది. ఈ నేపథ్యంలో అక్క కూడా తనపై జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఇంట్లో వారంతా ఓ సారి చర్చించుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గన్‌తో ఆడుకుంటూ తల్లిని కాల్చి చంపిన మూడేళ్ల బాలుడు..
కోడలి శీలాన్ని అమ్మేసిన అత్త! ఇంత దారుణమా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
