వేరే వ్యక్తి భార్య గర్భం దాల్చితే ఇద్దరు యువకులు సంబరపడ్డారు. తండ్రి నేనంటే నేను అని కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఒక యువకుడి మృతి చెందగా మరో యువకుడు జైలు కెళ్లాడు. విచిత్రమైన ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాలు.. తమిళనాడులోని సేలం జిల్లా అయోధ్య పట్టణంలోని రామ్‌నగర్ కాలనీకి చెందిన మురుగేశన్, కలైమణి(23) అనే యువతిని కొంతకాలం క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. అయితే కలైమణికి పెళ్లికి ముందు నుంచే అరసన్(23), కృపై రాజ్(23) అనే ఇద్దరు యువకులతో అఫైర్ నడుస్తుంది.
ఇటీవల ఆమె గర్భం దాల్చడంతో భర్త కంటే ఎక్కువగా ఇద్దరు ప్రియుళ్లు సంబరపడ్డారు. అక్కడే ఇద్దరి మధ్య కొత్త వివాదం చెలరేగింది. కలైమణికి పుట్టబోయే బిడ్డకు తండ్రిని తానేనంటూ ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలోనే అరసన్ విచక్షణ మరిచి కత్తితో కృపైరాజ్‌పై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో కృపైరాజ్‌పై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కలైమణి, కలై అరసన్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో మురగేశన్ బలిపశువయ్యాడు.