పాలన వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి జనరంజక పాలన దిశగా అడుగులు వేయాల్సిన పొలిటికల్ లీడర్స్ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ సమాజం ముందు అబాసు పాలవుతున్నారు. ఇక ఇదే కాకుండా ప్రజలకు జవాబు దారితనంగా ఉండాల్సిన నేటి తరం నేతలే తప్పు తోవలో వెలుతూ.. ప్రజల ముందు నవ్వుల పాలవుతున్నారు. ఇలాగే బరితెగించిన ఓ రాజకీయ నాయకుడు కోపంతో ఓ బాలుడి ముక్కు కొరికాడు. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే?.. సచిన్ సాహూ అనే రాజకీయ నాయకుడు లలిత్ పుర్ అనే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఇతని దగ్గర అభయ్ నామ్‌దేవ్ అనే 16 ఏళ్ల బాలుడు సహాయకుడిగా పని చేస్తున్నాడు. కాగా ఈ శనివారం సాయంత్రం ఆ బాలుడు ఏదో చిన్న పొరపాటు చేశాడు. దీనికే కోపంతో ఊగిపోయిన సచిన్ సాహూ ఆ బాలుడిపై విర్రవీగి ప్రవర్తించాడు. కోపంతో ఊగిపోయి ఏం చేయాలో అర్థంకాక ఆ బాలుడి ముక్కు కొరికాడు.
ఈ కిరాతకుడి దాడిలో తీవ్ర రక్తస్రావమైన అభయ్ ని స్థానికులు గమనించి వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం విశేషం. ప్రస్తుతం ఈ బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఇలా క్షణికావేశంలో బాలుడి ముక్కు కొరికిన ఈ రాజకీయ నాయకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.