అప్పటికే భారీ వర్షాలు వారి జీవితాలను అతలాకుతలం చేశాయి. ఉన్నదంతా వరదల్లో కొట్టుకుపోయింది. కట్టుబట్టలతో మిగిలారు. ఈ క్రమంలో అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక బాధితులు కూడా సరే ప్రాణాలైతే మిగిలాయి కదా.. ఇక ఏదో ఓ రోజు కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు అనే ఆశతో ముందుకు సాగారు. వరదలు తగ్గుముఖం పట్టాక తిరిగి సొంత ఊరికి బయలుదేరారు. అయితే వరదలు వారిని వదిలేస్తే.. అగ్ని ప్రమాదం రూపంలో మృత్యువు వారిని వెంటాడింది. రన్నింగ్ బస్సులో మంటలు చెలరేగి.. సుమారు 21 మంది సజీవ దహనం అయ్యారు. విచారకర అంశం ఏంటంటే.. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఈ దారుణ సంఘటన బుధవారం రాత్రి పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు..
పాకిస్తాన్ పోర్ట్ సిటీ కరాచీలో ఈ దారుణ ప్రమాదం మాదం చోటు చేసుకుంది. సింధ్ ప్రావిన్స్ కరాచీ-హైదరాబాద్-జామ్‌షోరో నగరాలను కలుపుతూ ఉన్న ఎం-9మోటర్‌వేపై ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. రన్నింగ్ బస్సలు మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. వీరిలో 21 మంది అక్కడికక్కడే సజీవదహనం కాగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రలును ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నట్లు హెల్త్ సెక్రటరీ సిరాజ్ ఖ్వాసిం తెలిపారు.
ఇక బాధితులంతా దాదూ జిల్లాకు చెందిన వరద బాధితులు. వీరికి వేరే చోట తాత్కలికంగా ఆశ్రయం కల్పించారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో.. బాధితులను ఓ ప్రైవేట్ బస్సులో స్వస్థలానికి తరలించారు. ఈ క్రమంలో బస్సులో ప్రయాణంలో ఉండగానే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Terrible accident at Noori Abad near Karachi in bus fire.
18 people burnt alive including children, dozens injured and in critical condition.
My heart is with the families of victims pic.twitter.com/JDCd7litqR— Shama Junejo (@ShamaJunejo) October 12, 2022