ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్నేళ్ల నుంచి చెడ్డీ గ్యాంగ్ పేరుతో ఓ దొంగల ముఠా తిరుగుతున్న విషయం తెలిసిందే. ఒంటిపై నూలు పొగంత బట్టలు కూడా లేకుండా ఒళ్లంత నూనే, చేతిలో మారణాయుధాలతో అర్థరాత్రి పూట గల్లీలు తిరుగుతుంటారు. ఇంట్లోకి చొరబడడం, దొంగతనాలు చేయడం మొదట్లో హైదరాబాద్ లో కనిపించిన ఈ ముఠా సభ్యులు ఆ తర్వాత ఏపీలోని పలు జిల్లాలో కనిపించారు. అయితే తాజాగా ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా మరోసారి నిజామాబాద్ లోకి ఎంటర్ అయింది. కంటేశ్వర్, హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లో ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా సంచరిస్తున్నట్లుగా తెలుస్తోంది.
కాగా వీరు కాలనీల్లో సంచరిస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో కనిపించడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను పరిశీలిస్తే.., ఒంటిపై ఎలాంటి బట్టలు లేకుండా ఒళ్లంత నూనే రాసుకుని, మారణాయుధాలు చేతబట్టి గల్లీ గల్లీని సంచరిస్తున్నారు. ఇక వీరిపై ఫోకస్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వినటానికి వెన్నులో వణుకు పుట్టేలా ఉండే వీరి ఘొరాలను తలుచుకుంటూ భయం భయంగా గడుపుతున్నారు.
దీంతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. అన్ని కాలనీల్లో సీసీ కెమరాలో బిగిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరూ కూడా భయందోళనలకు గురి కావొద్దని, అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అయితే గతంలో నిజామాబాద్ జిల్లాలో ఈ చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు ఏకంగా ఓ బ్యాంకునే లూటీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తాజాగా మరోసారి జిల్లాలోకి చెడ్డీ గ్యాంగ్ ముఠా రావడంతో ప్రజలకు భయందోళనలకు గురవుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ ముఠా దారుణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.