Newly Wed Woman: కోటి ఆశలతో కొత్త జీవితంలో అడుగుపెట్టిన ఓ నవ వధువు జీవితం అర్థాంతరంగా ముగిసింది. జ్వరం రూపంలో ఆమెను మృత్యువు కబళించింది. ఆ యువతి జీవితం విషాదాంతమైంది. పెళ్లైన 19 రోజులకే భర్తను విడిచి సుధూర తీరాలకు వెళ్లిపోయింది. అటు పుట్టింటిని.. ఇటు అత్తింటిని విషాదంలో ముంచేసింది. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర కన్నడ జిల్లా కార్వార తాలూకా కిన్నెర గ్రామానికి చెందిన 24 ఏళ్ల సనా మంజ్రేకర్‌కు కాడవాడ గ్రామానికి చెందిన స్వప్నిల్ మంజ్రేకర్‌తో మే 10వ తేదీన పెళ్లి జరిగింది. అప్పగింతల తర్వాత అత్తారింటికి చేరిన సనాకు జ్వరం పట్టుకుంది. ఎనిమిది రోజుల పాటు జ్వరంతో అల్లాడిపోయింది.
ఈ నెల 28వ తారీఖు జ్వరం, తలనొప్పి పెరిగిపోవటంతో కుటుంబసభ్యులు ఆమెను కారవార్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. సనా అనారోగ్యంతో చాలా నీరసించిపోవటంతో ఆసుపత్రి సిబ్బంది గ్లూకోజ్ పెట్టారు. రాత్రి నాలుగు ఇంజెక్షన్లు కూడా ఇచ్చారు. ఇంజెక్షన్ల తర్వాత సనా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో ఆ ఆసుపత్రిలో ఐసీయూ లేకపోవటంతో సనాను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్‌లో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 29వ తేదీ ఉదయం 4.30 గంటలకు ఆమె మరణించింది.
సనా మరణానికి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. అనంతరం కార్వార్ పోలీస్ స్టేసన్‌లో ప్రైవేట్ ఆసుపత్రిపై ఫిర్యాదు చేశారు. సనా మరణానికి ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. సనా మరణానికి సంబంధించి తమకు న్యాయం చేయాలని కోరారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Shantabai: ఈ భార్య వక్రబుద్ది వాళ్ళ కాపురాన్ని కూల్చేసింది! అంతా భర్తకి తెలిసే..!