దేశంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎంతగానో పెరిగిపోయాయి. జేబులో రూపాయి లేకపోయినా బయట కావాల్సినవన్నీ కొనేసుకు రావచ్చు. బడ్డీ కొట్టు నుంచి తాజ్ బంజారా దాకా ఏ దుకాణంలోనైనా ఎంతో సులువుగా UPI పేమెంట్స్ చేసేయచ్చు. దేశ పౌరులు ఆన్ లైన్ పేమెంట్స్ వైపునకు మళ్లడంతో ఎన్నో కొత్త ఆన్ లైన్ ట్రాన్సెక్షన్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు తమ పబ్బం గడుపుకుంటున్నారు. దుకాణదారులను ఎంతో సులువుగా మోసం చేసి ఫ్రీగా షాపింగ్ చేసేస్తున్నారు.
ఇదీ చదవండి: షావోమీ ఇండియాపై పన్ను ఎగవేత ఆరోపణలు! షోకాజ్ నోటీసులు జారీ
అసలు విషయం ఏంటంటే.. ఇప్పుడు ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ ఎలా అయితే ఉన్నాయో.. వాటికి క్లోన్ యాప్స్, ఫ్రాడ్ యాప్స్ కూడా అలాగే వస్తున్నాయి. ప్రస్తుతం వ్యాపారులకు ఈ యాప్స్ ద్వారా ఎంతో నష్టం కలుగుతోంది. తాజాగా అలాంటి మోసాన్ని ఒక వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆ వీడియో సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. అలాంటి ఫ్రాడ్ పేమెంట్స్ కోసం ఒక యాప్ ను వాడుతున్నారు. ఆ యాప్ ద్వారా స్కాన్ చేసేందుకు వీలుండదు. నేరుగా మొబైల్ నంబర్, పేరు టైప్ చేయాలి. ఆ తర్వాత అమౌంట్ ను ఎంటర్ చేయాలి. OK కొట్టగానే మీరు టైప్ చేసిన అమౌంట్ అవతలి వ్యక్తికి క్రెడిట్ అయినట్లు గ్రీన్ టిక్ వస్తుంది.
పేమెంట్ సక్సెస్ అయినట్లు సదరు వ్యక్తి మొబైల్ లో కనిపిస్తుంది. కానీ, వారికి అమౌంట్ వెళ్లదు. నెట్ వర్క్ ప్రాబ్లమ్ ఉందేమో.. మీ బ్యాంక్ స్టేట్ మెంట్ చెక్ చేసుకోండి అంటూ కబుర్లు చెబుతారు. వచ్చేస్తాయి లెండి కాసేపటికి అని వెళ్లిపోతారు. వారికి ఆ మొత్తం వచ్చే అవకాశం ఉండదు. అసలు ఆ ఫ్రాడ్ ఎలా చేస్తున్నారో మీరూ ఓ లుక్కేయండి. ఆ ఫ్రాడ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.