నగదు రహిత లావాదేవీల్లో భారతదేశం చాలా పురోగతి సాధించిందనే చెప్పాలి. ఎక్కువగా యూపీఐ యాప్స్ ద్వారానే ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ లావాదేవీల మీద ఛార్జెస్ లేవు. కానీ, పీపీఐ ద్వారా యూపీఐ మర్చంట్స్ చేసే లావాదేవీలపై ఛార్జెస్ పడనున్నాయి.
దేశంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎంతగానో పెరిగిపోయాయి. జేబులో రూపాయి లేకపోయినా బయట కావాల్సినవన్నీ కొనేసుకు రావచ్చు. బడ్డీ కొట్టు నుంచి తాజ్ బంజారా దాకా ఏ దుకాణంలోనైనా ఎంతో సులువుగా UPI పేమెంట్స్ చేసేయచ్చు. దేశ పౌరులు ఆన్ లైన్ పేమెంట్స్ వైపునకు మళ్లడంతో ఎన్నో కొత్త ఆన్ లైన్ ట్రాన్సెక్షన్ యాప్స్ పుట్టుకొస్తున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు తమ పబ్బం గడుపుకుంటున్నారు. దుకాణదారులను ఎంతో సులువుగా మోసం చేసి ఫ్రీగా షాపింగ్ చేసేస్తున్నారు. […]