తాళికట్టిన భర్తను కాదని కొందరు భార్యలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న భర్త అడ్డుచెప్పడంతో భార్యలు అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించాలనుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు నిద్రపోయిన భర్తను ప్రియుడి సాయంతో దారుణంగా హత్య చేసింది. నంద్యాలలో వెలుగు చూసిన ఈ ఉదాంతం స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా పాణ్యం. ఇదే ప్రాంతానికి చెందిన షేక్ జవహర్ హుసేన్-షేక్ హసీనా భార్యాభర్తలు.
భర్త బనగానపల్లె మండలం చెరువుపల్లెలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు, ఓ కూతురు కూడా జన్మించింది. మంచి జీతం, చక్కని కాపురం ఉండడంతో వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగేది. హ్యాపీగా సాగుతున్న కాపురంలో భార్య కొన్నాళ్లకి తన బుద్దిని వక్రమార్గంలోకి తీసుకెళ్లింది. అంతేకాకుండా షేక్ హసీనా స్థానికంగా ఓ వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని నడిపిస్తుంది. అలా భర్తకు తెలియకుండా భార్య కొంత కాలం బాగానే చీకటి కాపురాన్ని నెట్టుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Nandyala: మైనర్ల ‘ప్రేమకథ’.. అసలేం జరిగిందంటే?
కొంత కాలానికి ఈ విషయం భర్తకు తెలియడంతో పెద్దలతో పంచాయితీ పెట్టించడంతో వారు సర్దిచెప్పారు. అయినా భార్య బుద్ది మాత్రం మారలేదు. భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్తను లేకుండా చేయాలనుకుంది. ఇందులో భాగంగానే ముందుగానే స్కెచ్ వేసిన భార్య తన పిల్లలను తన తల్లి ఇంటికి పంపించింది. అదే రోజు రాత్రి భర్త నైట్ నిద్రలోకి జారుకున్నాక ప్రియుడికి ఇంటికి రప్పించుకుంది. ఇక అర్థరాత్రి అయ్యాక నిద్రపోతున్న భర్తను గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది.
అనంతరం నాకేం తెలియనట్టుగా అమాయకురాలిగా నటించిన భార్య ఆస్తమా కారణంగానే నా భర్త మరణించాడని తెలిపింది. దీంతో అనుమానమొచ్చిన మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను అన్ని కోణాల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. చివరికి హత్య చేసింది నేనేనంటూ షేక్ హసీనా ఒప్పుకుంది. ఇక పోలీసులు ఆ మహిళతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.