నిర్భయ, దిశ, పోక్సో చట్టాలు వంటివి ఎన్నివచ్చినా కూడా దేశంలో అమ్మాయిలు, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంట, బయట ఎక్కడా భద్రత లేదు. ఎక్కడో కామాంధుడు పుట్టడం లేదు. తెలిసిన వాళ్లే యువతులు, మహిళలు, చిన్నారి బాలికలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వీరిపైనే కాదూ.. ముక్కు పచ్చలారని పసి మొగ్గలను కాలరాస్తున్నారు. చిన్న పిల్ల అని చూడకుండా 20 నెలల పసిబిడ్డపై తన కామవాంఛను తీర్చుకున్నాడో రాక్షసుడు. ఈ ఘటన మహారాష్ట్ర లోని ముంబయిలో చోటుచేసుకుంది.
సెంట్రల్ ముంబయిలో ఓ కుటుంబం నివసిస్తోంది. వీరికి 20 నెలల చిన్నారి ఉంది. ఇంట్లో పాప తల్లి దండ్రులు లేని సమయాన్ని చూసిన వీరి ఎదురింట్లో ఉండే 35 ఏళ్ల వ్యక్తి.. పసిబిడ్డపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పాప ఏడుస్తుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు, ఏం జరిగిందని అడగ్గా,ఆ ఎదురింట్లో ఉండే అంకుల్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడ్ని అరెస్టు చేసి ఐపిసిలోని 376 సెక్షన్ కింద, పోక్సో చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసులు నమోదు చేశారు.