ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి రియాక్టర్ పేలిపోయింది. ఈ క్రమంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్టీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఫ్యాక్టరీలో 150 మంది ఉన్నట్లు సమాచారం. ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నామని చెప్పారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.