ఇటీవల దేశ వ్యాప్తంగా పలు కెమికల్ ఫ్యాక్టరీల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి.. సాంకేతిక లోపాలు.. ఇతర కారణాలు ఏవైనా ఎంతో మంది కార్మికుల నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అప్పటికప్పడు కంటితూడు చర్యలు తీసుకుంటారు.
ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం గ్రామంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఆరుగురు సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ విషాదంతో ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిశ్రమ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగతోంది. ఈ కెమికల్ ఫ్యాక్టరీ వల్ల ప్రమాదం చోటు చేసుకోవడమే కాక.. దాని నుంచి విడుదలయ్యే రసాయన వ్యర్థాల వల్ల ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఆరేళ్ల వయసు నుంచే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. […]
ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. యూనిట్-4లో గ్యాస్ లీకై మంటలు చెలరేగి రియాక్టర్ పేలిపోయింది. ఈ క్రమంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవదహనం కాగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడగా.. వారిని చికిత్స […]