మహారాష్ట్రలో అమానవీయకర సంఘటన చోటు చేసుకుంది. మంత్రాలు చేస్తుందనే నెపంతో ఓ మహిళను గ్రామస్తులు వివస్త్రను చేసి సభ్యసమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని మారుమూల గ్రామంలోని ప్రజలు నేటికి ఇంకా నమ్ముతునే ఉన్నారు.
ఇది కూడా చదవండి: భారతావనిలో రంకెలేస్తున్న కుల వివక్ష! నాలుకతో కాళ్లు నాకించారు!
అయితే మహారాష్ట్రలో నందుబార్ జిల్లాలో ఓ మహిళ నివసిస్తుంది. ఈ మహిళ మంత్రాలు చేస్తుందని, దీని వల్ల చాలా అనర్ధాలు జరుగుతున్నాయని గ్రామస్తులు అంతా కట్టుకుని వచ్చారు. ఇంతటితో ఆగకుండా ఏకంగా ఆ మహిళపై దారుణంగా వ్యవహరించారు. కొట్టి వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. ఇదే దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియోను చూసిన అధికారులు ఘటనపై త్వరితగతిన విచారణ జరపాల్సిందిగా నందుర్బార్ లోని జిల్లా అధికారులను కోరారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ మానవీయకర సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.