ఈ మద్య కొంత మంది వివాహ బంధానికి తీరని మచ్చ తెస్తున్నారు. వేదమంత్రాల సాక్షిగా.. బంధు మిత్రుల ఆశీర్వాదంతో ఒక్కటైన జంట కొద్ది నెలల్లోనే మనస్పర్ధలతో విడిపోతున్నారు. అనుమానాలతో నిండు సంసారాన్ని రచ్చకీడుస్తున్నారు. ఇక పెళ్లి పేరుతో కొంత మంది కేటుగాళ్లు మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటున్న నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టయ్యింది. ఈ ఘటన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
వెంకటనర్సింహారెడ్డి(36) 2009లో మహేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్తల మద్య అభిప్రాయ భేదాలతో విడిపోయారు. ఆ తర్వాత ఊట్కూర్ మండలం సమస్ధపురం గ్రామానికి చెందిన గీతను 2012లో ముంబాయిలో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత గొడవ పడి విడిపోయాడు. కొంత కాలం ఒంటరిగా ఉన్న వెంకటనర్సింహారెడ్డి మరో పెళ్ళికి సిద్దమయ్యాడు.
ఈ నేపథ్యంలో గజ్జల రాణిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు సంసారం చేసిన తర్వాత గొడవలు మొదలు కావడంతో ఆమె విడాకులు తీసుకుంది. ఈ విషయాలన్నీ దాచిపెట్టి 2021లో నారాయణపేట మండలం అప్పంపలల్లి గ్రామానికి చెందిన గోపికను పెళ్లి చేసుకున్నాడు. ఈమెతో కాపురం చేస్తూనే కొన్ని పర్సనల్ పనులు ఉన్నాయని.. ఊరికి వెళ్తున్నా అంటూ మొదటి భార్య మహేశ్వరి వద్దకు వెళ్లాడు. భర్త కొంత కాలంగా రాకపోవడంతో గోపిక నిత్యపెళ్లికొడుకు ఆరా తీసింది. ఆ తర్వాత ఆమెను చిత్ర హింస పెట్టడం మొదలు పెట్టాడు.
ఈ క్రమంలో ఆమె శుక్రవారం సఖి కేంద్రంలో ఫిర్యాదు చేసింది. సెంటర్ నిర్వాహకులు మహేశ్వరిని, హైదరాబాద్‌లో ఉంటున్న గీతను, నారాయణ పేటలో ఉంటున్న గోపికను పిలిపించి మాట్లాడారు.. అనంతరం మహేశ్వరి, గీత పీఎస్ లో ఫిర్యాదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.