ఈ మద్య చాలామంది ప్రతి చిన్న విషయానికి తీవ్రమైన ఆవేశానికి గురి అవుతున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి చనిపోవడం లేదా ఎదుటి వారిపై దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు.
నేటి సమాజంలో కొంతమంది మనుషులు క్రూర మృగాల కన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మానవ సంబంధాలు పూర్తిగా మర్చిపోయి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ప్రేమ పేరుతో యువతీయువకులు ఒకరినొకరు చంపుకోవడం, అనుమానాలతో భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవడం నిత్యం ఎక్కడో జరుగుతుంది. కత్తితో సొంత కూతురిపై పాశవికంగా దాడిచేశాడు ఓ కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన సూరత్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే…
మొన్న ఢిల్లీలో 16 ఏళ్ల అమ్మాయిని యువకుడు అత్యంత దారుణంగా పొడిచి, రాయితో మోది చంపాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర భయాందోళన సృష్టించింది. అసలు మనుషులు ఇంత దుర్మార్గంగా ఉంటారా అని ఆ వీడియో చూసినవాళ్లు షాక్ కి గురయ్యారు. ఆ ఘటన మరువక ముందే సూరత్ లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కూతురుని ఓ కసాయి తండ్రి విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హతమార్చాడు. సూరత్ లోని సత్య నగర్ సొసైటీలో ఓ ఫ్లాటులో రామానుజ అనే వ్యక్తి భార్య, కూతురు తో కలిసి అద్దెకు ఉంటున్నాడు.
వేసవి కాలం కావడంతో ఉక్కపోత భరించలేక మేడపై పడుకుందామని భార్య, కూతురు అడిగారు. ఈ విషయంలో భార్యాభర్తల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విచక్షణ కోల్పోయిన రామానుజ కత్తి తీసుకువచ్చి తల్లిపై దాడి చేసే యత్నం చేశాడు. తల్లికి అడ్డుగా కూతురు రావడంతో మరింత కోపంతో అడ్డొచ్చిన కూతురుని అత్యంత పాశవికంగా 25 సార్లు పొడిచి చంపాడు. దాడి చేసే సమయంలో తల్లి అడ్డు రావడంతో ఆమెపై కూడా దాడి చేశాడు.. ఇరుగు పొరుగు బంధించే ప్రయత్నం చేయగా వారిని కూడా గాయపరిచాడు. ఈ దారుణ దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రామానుజ ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి జైలు కి పంపించారు.