live in relationship : ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట మధ్య పెద్ద గొడవ చోటుచేసుకుంది. ప్రియురాలిపై రెచ్చిపోయిన ప్రియుడు ఆమెను దారుణంగా చితక్కొట్టాడు. ఆమెను జుట్టుపట్టుకుని కొడుతూ, రోడ్డుపై ఈడుస్తూ అందరి ముదే రచ్చరచ్చ చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు, సీతానగర్‌కు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. గత ఐదేళ్లుగా గోమతినగర్‌లోని రామేశ్వర్‌పురలో ఓ అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే, గురువారం ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ యువకుడు, ప్రియురాలిపై ఫైర్ అయ్యాడు. ఆమె జుట్టుపట్టుకుని ఇంటి బయటకు లాక్కువచ్చాడు.
రోడ్డుపై బరబరా ఈడుస్తూ చెంపలు రెండూ వాయించాడు. కొద్దిసేపు విచక్షణా రహితంగా కొట్టాడు. జనం మొత్తం గుమికూడి తమాషా చూశారు. ఈ దృశ్యాలను కొంతమంది వీడియో తీశారు. ఆ వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ ఇద్దర్నీ ఎంక్వైరీ చేస్తామని తెలిపారు. యువతి, ప్రియుడిపై కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మరి ఆ యువతి అతడిపై కంప్లైంట్ ఇస్తుందో లేదో చూడాలి. కంప్లైంట్ ఇచ్చి ఐదేళ్ల సహజీవనానికి తెరదించుతుందా?.. లేక జరగిందేదో జరిగిపోయిందని ప్రియుడితో సర్ధుకుపోతుందా? అన్నది వేచి చూడాల్సిందే.. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇదేం ఘోరం.. లేగదూడను కూడా వదల్లేదు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.