ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుంది. నలుగురు బిడ్డలను కన్నది. ఇన్ని రజుల తర్వాత భర్త ముందు తనను తాను పతివ్రతగా నిరూపించుకునేందుకు.. కన్నబిడ్డను సజీవ దహనం చేసింది ఓ కసాయి తల్లి. చెన్నైలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరిచింది. వివరాలు..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
తూత్తుకూడికి చెందిన పాల్ వణ్ణన్ కొన్నేళ్ల క్రితం భార్య జయలక్ష్మితో కలిసి చెన్నైకు వచ్చాడు. వీరికి నిత్య అనే కుమార్తె ఉంది. కొన్నాళ్ల అనంతరం భర్త, కుమార్తెను వదిలిపెట్టి మరిది దురైరాజ్ తో ముంబైకు పారిపోయింది జయలక్ష్మి. అక్కడ పెళ్లి చేసుకున్న వీరికి పవిత్ర అనే (10) కుమార్తె ఉంది. ఏడేళ్ళ క్రితం జయలక్ష్మిని వదిలిపెట్టి దురైరాజ్ ఏటో వెళ్లిపోయాడు. తర్వాత కొద్ది రోజులు పాటు ముంబైలో ఉన్న జయలక్ష్మి కుమార్తె పవిత్రతో కలిసి చెన్నై తిరువొత్తియూరుకు వచ్చేసింది. ఇక్కడ ఓ లారీ డ్రైవర్ ని మూడో వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె భానుప్రియ(06), కుమారుడు భూపాలన్(05) ఉన్నారు.
కాగా ఇటీవల మూడో భర్త పద్మనాభన్ జయలక్ష్మిపై అనుమానంతో నిత్యం గొడవపడే వాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దంపతులు మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. జయలక్ష్మి ఏ తప్పు చేయలేదని నమ్మాలంటే.. రెండో భర్తకు పుట్టిన బిడ్డను చంపాలని భర్త ఆదేశించాడు. అతడి ఆదేశాల మేరకు నిద్రలో ఉన్న రెండో భర్త దురైరాజ్ కు పుట్టిన పవిత్రపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టింది తల్లి. అలా కాలిపోతున్న బిడ్డపై ఏ తప్పు చేయలేదంటూ ప్రతిజ్ఞ కూడా చేసింది. ఆ తర్వాత కాసేపటికి మేల్కొన్న ఈ కసాయి తల్లి మంటల్లో కాలుతున్న బిడ్డను రక్షించే ప్రయత్నం చేసింది. స్థానికులతో కలసి బిడ్డను ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ పవిత్ర మృతి చెందింది. సోమవారం పోలీసుల దర్యాప్తులో జయలక్ష్మి మూడు పెళ్లిల భాగోతం వెలుగు చూసింది. దీంతో ఆమెను, మూడో భర్తను అరెస్టు చేశారు.