అన్వర్ హుస్సేన్, సలీమా కథూన్ దంపతులు త్రిపురలో నివాసం ఉంటున్నారు. చూడటానికి అమాయకులుగా కనపడే ఈ జంట కష్టపడకుండా డబ్బులు సంపాధించాలని పక్కా స్కెచ్ వేశారు. చెన్నై, బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రులు, బ్యూటీపార్లల్ లో ఉద్యోగాలు అని చెప్పి అందంగా ఉన్న అమ్మాయిలను వ్యభిచార వృత్తిలోకి దించుతున్నారు. ఆ వివరాలు..
అగర్తలకు చెందిన అన్వర్ హుస్సేన్, సలీమా కథూన్ దంపతులు.. అల్లావుద్దీన్ (23), మైనుద్దీన్ (26) అనే మరో ఇద్దరు సోదరులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. మొదట ఈ ముఠా అందంగా ఉన్న అమాయకులైన అమ్మాయిల కుటుంబ సభ్యులను టార్గెట్ చేసుకుంటారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో బ్యూటీ పార్లర్లు, ఆస్పత్రుల్లు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాం అని నమ్మబలుకుతారు. మొదట వేలల్లో జీతాలు ఇస్తారని, తరువాత లక్షల్లో జీతాలు వస్తాయని అమ్మాయిల కుటుంబ సభ్యులకు తియ్యటి మాటలు చెప్తారు. ఇలా నమ్మించి అమ్మాయిలను తీసుకొస్తున్న ఈ ముఠా వారిని చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా.. హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలతో లింక్ పెట్టుకొని అమ్మాయిలను వారికి విక్రయిస్తున్నారు. తాజాగా మరి కొందరు అమాయక యువతులను వ్యభిచార ముఠాకు అమ్మేసే ప్రయత్నంలో ఉండగా.. పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి : ప్రియుడి మోజులో భార్య! దేవుడిలాంటి భర్తని..
చెన్నై నుంచి బెంగళూరుకు అమ్మాయిలను తరలించడానికి చెన్నైలోని కీలంబాక్కంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జ్ లో ఈ ముఠా మకాం వేశారు. అమ్మాయిలకు వీరి ప్లాన్ తెలిసి ఎదురు తిరడంతో ఈ గ్యాంగ్ అమ్మాయిలను చితకబాదారు. ఆ సమయంలో అమ్మాయిలు కేకలు వెయ్యడంతో లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పక్క సమాచారంతో సలీమా, అన్వర్ ను అరెస్టు చేసిన పోలీసులు.. నలుగురు అమ్మాయిలను మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. మైనుద్దీన్, అల్లావుద్దీన్ తప్పించుకోవడంతో వారి కోసం చెన్నై సిటీ పోలీసులు గాలిస్తున్నారు.