బాగా చదివి జీఎస్‌టీ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించింది. తర్వాత టీవీల్లో అవకాశం రావడంతో ఉద్యోగం మానేసి అక్కడకు వెళ్లింది. నేడు 263 కోట్ల స్కాంలో కీలక పాత్రధారిగా మిగిలింది క్రితి వర్మ.. ఇంతకు ఆమె ఏం చేసింది అంటే..
బాగా చదివి ప్రభుత్వం ఉద్యోగం.. అది కూడా ఆదాయ పన్ను శాఖలో జాబ్ సాధించింది. కొన్నాళ్ల పాటు పని చేసింది. ఆ తర్వాత ఆమె అదృష్టం బాగుండి టీవీల్లో కనిపించే అవకాశం లభించింది. బిగ్‌బాస్‌లో మెరిసింది. అయితే ఓ వైపు బుల్లితెర మీద రాణిస్తూనే.. మరోవైపు తను పని చేసి వచ్చిన ఆదాయశాఖలో అవకతవకలకు పాల్పడసాగింది. గతంలో తను పని చేసిన డిపార్ట్‌మెంటే కాబట్టి.. అక్కడ జరిగే విషయాల మీద పట్టు ఉండటంతో.. ఏకంగా మనీ లాండరింగ్ వంటి కేసుల్లో పాలుపంచుకుని.. కోట్ల రూపాయల సొమ్ము కూడబెట్టింది. తాజాగా 263 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలడంతో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రసుత్తం ఈ వార్త ఫిల్మ్ నగర్‌లో తెగ వైరలవుతోంది ఆ వివరాలు..
క్రితి వర్మ.. ప్రస్తుతం ఈమె పేరు బీటౌన్‌లో మారుమోగిపోతుంది. టాక్స్ ఆఫీసర్‌గా పని చేసిన క్రితి వర్మ ఆ తర్వాత బిగ్ బాస్ వంటి షోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా 263 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కీలక పాత్రధారిగా మిగిలింది. ఒకసారి ఆమె జీవితాన్ని పరిశీలిస్తే.. ఢిల్లీలో పుట్టిన క్రితి వర్మ.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్‌లో జీఎస్‌టీ ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగం సాధించింది. కొన్నాళ్లు.. జీఎస్‌టీ అధికారిగా విధులు నిర్వహించింది. ఈ క్రమంలో ఆమెకు బాలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు దక్కాయి. తొలుత రోడీస్, తర్వాత బిగ్‌బాస్ సీజన్ 12లో కంటెస్టెంట్‌గా మెరిసింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి.
అయితే బుల్లితెర మీద వచ్చిన క్రేజ్‌తో క్రితి వర్మ సంతృప్తి చెందలేదు. ఫేమ్‌తో పాటు ఆదాయం కూడా కావాలని భావించింది. దానిలో భాగంగా గతంలో తాన పని చేసిన పన్నుల శాఖలోనే అవకతవకలకు పాల్పడసాగింది. ఈ క్రమంలో 2021లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ల ద్వారా కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టింది. ఈ క్రమంలో తాజాగా ఆదాశపన్ను శాఖకు సంబంధించిన ఓ ముఖ్యమైన అధికారితో కలిసి.. భారీ స్కామ్‌లో పాలు పంచుకుంది. టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి పన్ను రీఫండ్ చేస్తామంటూ ఓ స్కామ్ ప్రారంభించి.. జనాలను మోసం చేయసాగారు. ఇలా సుమారు 263 కోట్ల భారీ మనీ లాండరింగ్ స్కామ్‌లో క్రితి వర్మ కీలక పాత్రధారిగా మారింది. దాంతో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. మరి క్రితి వర్మ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.