క్షణకాల సుఖం కోసం నిండు నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తప్పు చేస్తే దొరికిపోతాం.. శిక్ష తప్పదు అని తెలిసినా సరే.. చాలా మంది ఆ తప్పుడు మార్గంలోనే వెళ్తున్నారు. వివాహేతర సంబంధాల కోసం దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే.. వివాహం తర్వాత మాత్రం భార్యభార్తలు ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండాలి. బంధానికి విలువ ఇవ్వాలి. ఏ బంధానికి అయినా సరే నమ్మకమే పునాది. అయితే నేటి కాలంలో అనైతిక బంధాల మీద మోజుతో.. పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంటున్న వారు పెరిగిపోతున్నారు. క్షణకాల సుఖం కోసం నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిలో ఆడవారు కూడా ఉండటం విచారం కలిగించే అంశం. పెళ్లి తర్వాత ఇతర మగాళ్లపై మోజు పడటం.. అనైతిక బంధాల కోసం కడుపున పుట్టిన బిడ్డలను సైతం కడతేర్చుతున్న కసాయి మహిళల సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. ప్రియుడి మీద మోజుతో.. పుష్కర కాలం పాటు కాపురం చేసిన భర్తను కడతేర్చింది ఓ కసాయి భార్య. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన కర్ణాటక, మైసూరులో చోటు చేసుకుంది. హోటగళ్లికి చెందిన మంజుకు.. మైసూరు బోగాది ప్రాంతానికి చెందిన లిఖితతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు సంతానం ఉన్నారు. అయితే వివాహం అయిన తర్వాత మంజులకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దాంతో కొన్నేళ్ల క్రితం భర్త, బిడ్డలను వదిలి ప్రియుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే లిఖిత తల్లిదండ్రులు ఆమెను తీసుకువచ్చి సర్ది చెప్పి.. తిరిగి మంజుకి అప్పగించారు. పంచాయతీ పెద్దలు కూడా చెప్పడంతో మంజు, లిఖిత చేసిన తప్పును మన్నించి.. ఆమెతో కలిసి ఉండటానికి అంగీకరించాడు.
వ్యవహారం పంచాయతీ పెద్దల వరకు వెళ్లినా సరే లిఖిత తీరులో మార్పు రాలేదు. కొన్ని రోజులు మారినట్లు నటించింది. తర్వాత మళ్లీ మొదలు పెట్టింది. భార్య తీరుతో విసిగిపోయిన మంజు.. దీని గురించి తరచూ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన లిఖిత.. ప్రియుడితో కలిసి మంజు హత్యకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మంజును హతమార్చేందుకు రెడీ అయ్యారు. ప్రియుడితో కలిసి నిద్రపోతున్న భర్త పీకి పిసికి హత్య చేసింది లిఖిత. ఆ తర్వాత ఏం తెలియనట్లు.. తన భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అప్పటికే లిఖిత తీరు మీద అనుమానాలు ఉండటంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా.. అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు లిఖిత, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
తండ్రి మృతి చెందాడు.. తల్లి జైలుకు వెళ్లింది.. అసలు ఏం జరిగిందో అర్థం కానీ ఆ చిన్నారులు.. అమ్మనాన్నల కోసం కంటతడి పెట్టడం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మీ సుఖం కోసం బిడ్డల జీవితాలను నాశనం చేశావు కదా అంటూ లిఖిత మీద మండి పడుతున్నారు. మరి బిడ్డల గురించి కూడా ఆలోచించకుండా.. ప్రియుడి కోసం లిఖిత చేసిన పని సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.