హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఏపీకి చెందిన ఆరుగురు అమ్మాయిలతో హైటెక్ వ్యభిచారాన్ని నడుపుతున్నట్లుగా తాజాగా పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
హైదరాబాద్, పరిసర ప్రాంతాలను వేదికలుగా చేసుకుని కొందరు వ్యక్తులు పాడు పనులకు తెర లేపుతున్నారు. ఇప్పటికీ ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి. ఈ దాడుల్లో పోలీసులు అనేక మంది మహిళలను, అమ్మాయిలను రక్షించారు. అయితే, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మరొకటి వెలుగు చూసింది. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలియడంతో పోలీసులు ఓ ఓ రిసార్ట్ పై దాడులు నిర్వాహించారు. ఈ దాడుల్లో ఏకంగా 14 మందిని అదుపులోకి తీసుకోగా, ఆరుగురు అమ్మాయిలను రక్షించారు.
హైదరాబాద్ కు చెందిన విజయ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల అమ్మాయిలతో పాడు పనులకు తెర లేపాడు. కర్ణాటక కోలూరు జిల్లాలోని ముళబాగిలు పరిధిలోని ఓ రిసార్ట్ లోకి ఆ ఆరుగురు అమ్మాయిలను తీసుకుని హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహించారు. ఇక పోలీసులకు అనుమానం రావడంతో వెంటనే ఆ రిసార్ట్ పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 6 అమ్మాయిలను పోలీసులు రక్షించడంతో పాటు 14 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు రిసార్ట్ యజమాని, మహిళలను తీసుకొచ్చిన ఏజెంట్ పై కూడా పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కోలూరు జిల్లా ఎస్పీ ఎం నారాయాణ వివరాలు మీడియాకు తెలిపారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.