ప్రేమ పేరుతో వేధించే కేటుగాళ్ల సంఖ్య దేశంలో రోజు రోజుకు ఎక్కువవుతోంది. ప్రేమిస్తున్నానని వెంటపడడం, కాదంటే హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇవే నేటి కాలంలో ఎక్కవగా నమోదువుతున్న కేసులు. అయితే తాజాగా అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువతి.. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా కరీంనగర్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలానికి చెందిన కోలాపురి సరిత(22) అనే యువతి ఓ గ్రామంలో తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటోంది. అయితే గత కొంత కాలం నుంచి ఓ యువకుడు సరితను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నాడట. అయితే తాజాగా సరిత తండ్రి లింగయ్య రేషన్ బియ్యం తీసుకొచ్చేందుకు అని బయటకు వెళ్లాడు. అప్పటి దాక ఫోన్ లో మాట్లాడిన యువతి తండ్రి బయటకు అడుగుపెట్టగానే ఎవరూ లేని టైమ్ చూసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది కూడా చదవండి: kakinada: చనిపోవడానికి అనుమతి ఇవ్వండి.. జిల్లా ఎస్పీని వేడుకున్న మహిళ!
ఇక యువతి తండ్రి లింగయ్య ఇంటికొచ్చి చూసే సరికి కూతురు దూలానికి వేలాడుతూ కనిపించింది. ఈ సీన్ ను చూసిన తండ్రి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.