వివాహేతర సంబంధాలకు బలైన కొందరు మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయివాడితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అతనే సర్వస్వం అనుకుంటున్నారు. ఇలా ప్రియుడితోనే ఉండేందుకు సిద్దపడి అడ్డు ఎవరొచ్చినా వారిని లేపేసేందుకు సై అంటున్నారు. అలా తెగించిన ఓ కోడలు ఏకంగా అత్తను చంపి శవాన్ని గొనెసంచిలో మూటకట్టి గోదారిలో పడేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్ధానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సామర్లకోట మండలంలోని జి మేడపాడు గ్రామానికి చెందిన వ్యక్తితో ఓ మహిళకు గతంలో వివాహం జరిగింది. అయితే కొంతకాలం భార్య భర్తలిద్దరు కాపురం చేశారు. కాగా గతంలో ఉన్నట్టుండి భర్త మరణించడంతో భార్య అత్తింటి వద్దే నివాసం ఉంటుంది. ఇక కొంత కాలం బాగానే ఉన్న కోడలు రోజులు గడిచే కొద్ది ఆ మహిళ బుద్ది వక్రమార్గంలోకి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Nandigam: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ ఈ ఒక్క కారణంతోనే భార్యను దారుణంగా చంపేశాడు!
ఇంతటితో ఆగకుండా అదే గ్రామంలో నివాసం ఉంటున్న వెంకన్న అనే వ్యక్తితో ఆ మహిళ వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ ఉంది. ఇక ఈ విషయం రాను రాను తన అత్త అయినా మాణిక్యంకు తెలిసింది. ఇదే విషయమై అత్తతో కోడలు అనేక సార్లు గొడవకు కూడా దిగింది. ఇక ప్రియుడితో అడ్డుగా ఉందని భావించిన కోడలు అత్త మాణిక్యంను చంపాలనే ప్రయత్నం చేసింది. ఇక ఇందులో భాగంగానే ఇటీవల ప్రియుడితో పాటు మరో వ్యక్తితో హత్యకు ప్లాన్ గీసింది.
పథకం ప్రకారం కోడలు ప్రియుడితో పాటు మరో వ్యక్తితో అత్తను హత్య చేసి గోనె సంచిలో మూటకట్టింది. ఇక ఎవరికీ కూడా అనుమానం రాకుండా ఆ సంచిని స్థానికంగా ఉండే గోదారిలో పడేసింది. మార్చి 19 నుంచి తన భార్య కనిపించకపోవడంతో భర్త కృష్ణ పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఇక భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక పోలీసుల విచారణలో భాగంగా ఎట్టకేలకు కోడలే అత్తను చంపి శవాన్ని గోదారిలో పడేసినట్లు నిర్ధారణ అయింది. ఇక కోడలితో పాటు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.