ఈ రోజుల్లో ఆస్తుల కోసం దేనికైన తెగిస్తున్నారు. ఇంకొందరైతే ఊహించని దారుణాలకు కత్తులు నూరుతూ తొడబుట్టిన వాళ్లను సైతం హత్య చేయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే ఇటీవల ఆస్తి కోసం తండ్రి కుమారుడిని హత్య చేసిన విషయం తెలిసిందే. అయిదే ఈ ఘటన మరువకముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం ఏకంగా జన్మనిచ్చిన తల్లి పట్ల కర్కశంగా వ్యవహరించాడో కుమారుడు. కన్నతల్లి అన్న కనికరం మరిచి ఆస్తి కోసం కొడుకు తల్లిని దారుణంగా నరికి చంపాడు. తాజాగా రాజస్థాన్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది రాజస్థాన్ లోని జైపూర్ ప్రాంతం. ఇక్కడే ముఖేష్ యాదవ్, షీలా దేవి అనే తల్లీకొడుకు నివాసం ఉంటున్నారు. ముఖేష్ యాదవ్ స్థానికంగా పని చేసుకుంటూ తల్లికి చూసుకుంటూ ఉండేవాడు. ఇదిలా ఉంటే వీరికి పూర్వికుల నుంచి వచ్చిన కొంత భూమి ఉంది. అయితే తల్లి అదే భూమిని ఇటీవల అమ్మింది. ఇక అమ్మగా వచ్చిన డబ్బులను ఇవ్వాలని కుమారుడు ముఖేష్ యాదవ్ తల్లితో గత కొంత కాలంగా గొడవ పడుతున్నాడు. ఇదే విషయంపై తల్లీకొడుకు రోజూ గొడవ చేసుకున్నారు. అయితే తాజాగా ముఖేష్ యాదవ్ తల్లి షీలా దేవితో మరోసారి గొడవ పడ్డాడు.
దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన కుమారుడు ముఖేష్ యాదవ్ ఇంట్లో ఉన్న గొడ్డలితో తల్లిపై దాడికి పాల్పడి అక్కిడి నుంచి పరారయ్యాడు. కుమారుడి దాడిలో తల్లి షీలా దేవి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆ మహిళను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతు షీలా దేవి చివరికి ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.