ఈమధ్యకాలంలో.. చాలా చిన్న చిన్న కారణాలు.. అసలు ఏ కారణం లేకపోయినా సరే.. నిరాశానిస్పృలకు లోనయ్యి.. జీవితాలు అంతం చేసుకుంటున్న వారిని గమనిస్తున్నాం. ఎలాంటి కష్టాలు లేకపోయినా.. మంచి కుటుంబం, తల్లిదండ్రులు, స్నేహితులు ఉన్నా సరే.. చాలా చాలా చిన్న కారణాలకు కూడా ప్రాణాలు తీసుకుంటున్నవారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగు చూసింది. తల్లిదండ్రులు అల్లారుముద్దుగా బిడ్డను పెంచుకున్నారు. తమకున్నంతలో బాగా చదివిస్తున్నారు. బిడ్డకు మంచి భవిష్యత్తును ఇవ్వాలని భావించారు. బిడ్డే ప్రాణంగా బతికారు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రుల కలలను కల్లలు చేసింది. వారికి తీరని గుండెకోత మిగిల్చింది. ఆ అమ్మాయి చేసిన పనికి.. తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
హైదరాబాద్ పేట్‌బషీర్‌బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తిరుమల కాసాని రెసిడెన్సీలో.. సెకండ్ ఫ్లోర్ 216లో రామదుర్గాప్రసాద్, అరుణ దంపతులు ఉన్నారు. వారి కుమార్తె 17 ఏళ్ల స్వప్న.. ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా.. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న స్వప్న.. ఆ బాధ భరించలేక.. ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. స్వప్న చేసిన పనికి ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. మరి ఇంత కారణంతో.. తల్లిదండ్రులుకు గుండెకోత మిగిల్చిన స్పప్న నిర్ణయం సరైందేనా.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.