హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని కొంతమంది గలీజ్ దందాకు తెర లేపుతున్నారు. నగరంలో స్పా అండ్ సెలూన్ మూసుగులో ఈ పాడు పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. విషమం ఏంటంటే?
హైదరాబాద్ లో మరో గలీజ్ దందా వెలుగులోకి వచ్చింది. చాలా రోజులుగా కొంత మంది యువతులతో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ చీకటి బిజినెస్ ను పోలీసులు ఎట్టకేలకు చేదించారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులతో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకుని కొంతమంది గలీజ్ దందాకు తెర లేపుతున్నారు. నగరంలో స్పా అండ్ సెలూన్ మూసుగులో ఈ పాడు పనులు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. విషమం ఏంటంటే? మాదాపూర్ లోని కొంతమంది వ్యక్తులు స్పా అండ్ సెలూన్ లో ముసుగులో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ముంబైకి చెందిన ముగ్గురు యువతులను నగరానికి తీసుకొచ్చారు. ఇక వీరి ద్వారా స్పా అండ్ సెలూన్ నడుపుతున్నట్లుగా కట్టింగ్ ఇస్తూ.. తెర వెనుక నా సామి అంటూ.. వ్యభిచారాన్ని నడిపిస్తున్నారు.
ఈ గలీజ్ దందా గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు కొన్ని హోటల్, స్పా అండ్ సెలూన్ సెంటర్లపై దాడులు నిర్వహించారు.అయితే తాజాగా పోలీసుల దాడుల్లో భాగంగా మాదాపూర్ లోని స్పా అండ్ సెలూన్ పై రైడ్స్ నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు వ్యభిచార నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరితో పాటు ఇద్దరు విటులు, ముంబైకి చెందిన ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వ్యభిచార దందాను నడిపించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.