ప్రస్తుత సమాజంలో ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తూ మగవాళ్ల కంటే మేమేం తక్కువ కాదని నిరుపిస్తూ ముందుకెళ్తున్నారు. ఇక మన దేశంలో చూసుకుంటే.. మహిళలు రాజకీయ, క్రీడ, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆడపిల్ల పుడితే సంతోష పడాల్సింది పోయి కొందరు భార్యాభర్తలు పురుట్లోనే ప్రాణాలు తీసేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బెరితెగించిన ఓ కసాయి తండ్రి ఆడపిల్ల పుట్టిందనే అక్కసుతో నేలకోసి కొట్టిచంపాడు. తాజాగా ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైఫాబాద్ లోని భాసత్, ఫాతిమా అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 2015లో వివాహం కాగా నలుగురు సంతానం. అయితే వీరి మూడేళ్ల కూతురు ఇటీవల బాత్రూంలో ఆడుకుంటూ ఉంది. బయటకు రావాలని తండ్రి చెప్పినప్పటికీ రాలేదు. దీంతో కోపంతో ఊగిపోయిన తండ్రి బయటకు రాగానే కూతురని చూడకుండా ఇష్టమొచ్చిన రీతిలో కొట్టాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ బాలికను నేలకేసి కొట్టాడు. దీంతో ఆ బాలిక నోట్లో నుంచి నురగలు వచ్చాయి. వెంటనే గమనించిన భార్య హుటాహుటిన నీలోఫర్ ఆస్పత్రికి తరలించింది.
అక్కడి చికిత్స చేసిన వైద్యులు అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు. ఇక చికిత్స పొందిన ఆ బాలిక రెండు రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. అయితే తండ్రి భాసత్ ఆడపిల్ల పుట్టిందని ఎప్పటి నుంచో కాస్త కోపంతో ఉన్నాడని తెలుస్తోంది. ఈ ఘటనపై భార్య భర్త చేసిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కన్న కూతురిని ఇలా నేలకోసి కొట్టడమేంటి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కన్నకూతురని చూడకుండా కసాయిలా ప్రవర్తించిన ఈ తండ్రి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు!