భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. అప్పుడే తిట్టుకుని అప్పడే కలిసిపోయే దంపతులు కూడా ఉన్నారు. కానీ ఇలా కాకుండా కొందరు భార్యాభర్తలు మాత్రం ప్రతీ దానికి గొడవ పడుతూ ఉంటారు. ఇక ఇంతటితో ఆగకుండా చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ వివాహిత పెళ్లైన రెండేళ్లకే ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలు ఆ వివాహిత ఎందుకు ఆత్మహత్య చేసకుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
గుంటూరు జిల్లా పెదకూరపాడులో షేక్ ఆనాస్ అనే యువకుడు తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఇతనికి రెండేళ్ల కిందట నాగరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన షేక్ ఫాతిమా (20) అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల కాపురం బాగానే సాగింది. ఒకరిపై ఒకరు ప్రేమను పంచుకుంటూ సంతోషంగానే ఉండేవారు. గత ఆరు నెలల కిందట ఈ దంపతులకు ఓ పాప కూడా జన్మించింది. అయితే కొన్ని రోజులు గడిచాక భర్త ఆనాస్ ప్రతీ విషయానికి భార్యతో గొడవ పడేవాడు. దీనికి తోడు అత్తమామలు కూడా తోడవ్వడంతో ప్రతీ రోజూ ఫాతిమాను అనేక వేధింపులు గురి చేసేవారు. అయితే ఫాతిమా ఇవన్నీ మొదట్లో మాములే అని వదిలేసింది. కానీ రాను రాను భర్త, అత్తమామలు వేధింపులు శృతిమించడంతో తట్టుకోలేకపోయింది.
ఇక భర్తతో సుఖం లేని జీవితం నాకు వద్దని అనుకున్న ఫాతిమా.. ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఫాతిమా తల్లిదండ్రులకు సమచారం అందించాడు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ఫాతిమా తల్లిదండ్రులు ఫ్యానుకు వేలాడుతున్న కూతురుని చూసి తట్టుకోలేక కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అనంతరం కూతురు మరణంపై ఫాతిమా తల్లిదండ్రులు భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఫాతిమా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోలీసులు ఫాతిమా తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.