ఈ రోజుల్లో కొందరు వ్యక్తులు వివాహ బంధానికి తూట్లు పొడుస్తూ అక్రమ సంబంధానికి ఊపిరి పోస్తున్నారు. సొంత కాపురాన్ని పక్కన బెడుతూ అనేక మంది అక్రమ సంబంధాల మోజులో సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించి ప్రవర్తించిన ఓ ఇల్లాలు కట్టుకున్న భర్తకు పంగనామాలు పెట్టి సొంత మరిదిపై కన్నేసింది. అలా తన మరిదితో చీకటి కాపురాన్ని నడపిస్తూ అతడు దూరం కాకుండా సరికొత్త ప్లాన్ కు శ్రీకారం చుట్టి చివరికి ఎటు కాకుండా పోయింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అది గుజరాత్ అహ్మదాబాద్ సబర్బన్ పరిధిలోని మణినగర్ ప్రాంతం. ఇక్కడే నివాసం ఉంటున్న ఓ మహిళకు గతంలో ఓ వ్కక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ ఇల్లాలు భర్తతో సంసారం బాగానే చేసింది. కానీ రోజులు మారుతున్న కొద్ది ఆ మహిళ సొంత మరిదిపై కన్నేసి అతనితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. దీంతో మరిది కూడా వదినతో ఎంచక్కా రొమాన్స్ కు తెరలేపుతూ ఇద్దరూ ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో అత్తింటివాళ్లు మరిదికి పెళ్లి చేసేందుకు సంబంధాలు చూశారు. దీంతో వదినకు ఎక్కడ లేని భయం పట్టుకుంది. పెళ్లి చేస్తే మరిది నాకు దక్కకుండా పోతాడేమోనని తనలో తాను కుమిలిపోతూ ఉంది. ఈ సమయంలోనే వదనకు ఓ సరికొత్త ఐడియా తట్టింది.
తన అత్తింటివాళ్లతో మాట్లాడి తన సొంత చెల్లిని మరిదికి ఇచ్చి వివాహం జరిపించింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఆ మహిళ మరిదితో తన చీకటి కాపురాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. కానీ కొన్ని రోజులు గడిచాక వీరిద్దరి అక్రమ సంబంధం ఎట్టకేలకు బయటపడి.. తన చెల్లికి తెలిసింది. దీంతో అసలు నిజాలు బయటపడడంతో చెల్లెలు ఒక్కసారిగా షాక్ కు గురైంది. చేసేదేం లేక ఇదే విషయాన్ని చెల్లెలు కుటుంబ సభ్యుల ముందు తీసుకెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పరువు పోతుందని సైలెంట్ గా ఉండమని చెప్పారు. అయినా బుద్ది మార్చుకోని అక్క.., చెల్లెలి భర్తతో మళ్లీ చీకటి సంసారాన్ని నడిపిస్తూ వచ్చింది. దీంతో చేసేదేంలేక ఆ మహిళ అభయం హెల్ప్ లైన్ కు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అభయం కౌన్సిలర్లు వారిద్దరి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.