ఇతడు అతని స్నేహితుడిపై భార్యపై మోజుపడ్డాడు. ఎలాగైన ఆమెతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదటు పెట్టాడు. కానీ, అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే అతను మనసుపడ్డ వివాహిత ఫోన్ చేసి రాత్రి ఇంటికి రావాలంటూ చెప్పింది. ఆమె చెప్పినట్టే ఆ రోజు రాత్రి ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత జరిగింది ఇదే.
పైన ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పఠాన్. ఇతని వయసు 40 ఏళ్లు. చూడటానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్నా.. అసలు మ్యాటర్ వేరే ఉంది. అవును మీరు విన్నది నిజమే. విషయం ఏంటంటే? అందంగా ఉందని తన ప్రాణ స్నేహితుడి భార్యపై కన్నేశాడు. దీంతో ఆమెపై కోరికలు పెంచుకున్నాడు. ఎలాగైన ఆ మహిళతో కలిసి ఎంజాయ్ చేయాలని రాత్రిళ్లు కలలు కన్నాడు. అయితే ఇదే విషయాన్ని పఠాన్ స్నేహితుడి భార్యకు చెప్పాడు. ఇతని మాటను విన్న ఆ మహిళ మరుసటి రోజు పఠాన్ కు ఫోన్ చేసి రాత్రికి ఇంటికి రా అంటూ కబురు పంపింది. ఆమె చెప్పినట్టే పఠాన్ ఆ రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. గుజరాత్ అహ్మదాబాద్ లోని బాపూనగర్ ప్రాంతం. ఇక్కడే ఇమ్రాన్ (28), సయ్యద్ రిజ్వానా (27) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. అలా వీరి సంసారం సంతోషంగా సాగుతూ వెళ్తుంది. అయితే ఇమ్రాన్ కు పఠాన్ (40) అనే స్నేహితుడు ఉన్నాడు. ఇతడు వయసులో పెద్దవాడైన ఇమ్రాన్ తో కలిసి తిరిగేవాడు. అలా ఇద్దరు మంచి ఫ్రెండ్ గా మారిపోయారు. ఇకపోతే పఠాన్ అప్పుడప్పుడు ఇమ్రాన్ ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతని భార్య అయిన రిజ్వానాను చూశాడు. చూసిన మరుక్షణం నుంచే పఠాన్ ఆమెతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు.
చాలా రోజులు వెయిట్ చేశాడు. కానీ, అతనికి సరైన సమయం రాలేదు. ఇలా కాదని భావించిన పఠాన్.. గత ఏడాది కిందే రిజ్వానాకు అసలు విషయాన్ని చెప్పాడు. పఠాన్ ఆమె మొబైల్ నెంబర్ తీసుకుని తరుచు ఫోన్లు, మెసేజులు చేస్తూ ఉండేవాడు. అలా ఏడాది పాటు పఠాన్ రిజ్వానాను వేధించాడు. పఠాన్ టార్చర్ తట్టుకోలేక పోయిన ఆ వివాహిత.. ఇదే విషాయాన్ని మెల్లగా తన భర్త అయిన ఇమ్రాన్ కు వివరించింది. ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన ఆ మహిళ భర్త.. పఠాన్ కు వార్నింగ్ ఇచ్చాడు. అయినా అతడు బుద్ది మాత్రం మార్చుకోలేదు. ఇలా అయితే కాదని భావించిన ఇమ్రాన్.. నా పక్కనే ఉంటూ నా పెళ్లాంపైనే కన్నేస్తాడా అంటూ రగిలిపోయాడు.
ఇక ఎలాగైన పఠాన్ ను చంపాలని ఇమ్రాన్ అనుకున్నాడు. అది ఎలా అని ఆలోచించాడు. పక్కా ప్లాన్ తోనే.. ఈ ఏడాది జనవరి 21న రిజ్వానా పఠాన్ కు ఫోన్ చేసి ఈ రాత్రి మా ఇంటికి రావాలంటూ చెప్పింది. దీంతో పఠాన్ ఎగిరిగంతేసి ఆ రోజు రాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత నువ్వు కళ్లు ముసుకుంటే నీకు ఒక సర్ ప్రైజ్ ఇస్తానని రిజ్వానా చెప్పింది. దీనికి సరేనన్న పఠాన్.. ఆమె చెప్పినట్లు కళ్లు మూసుకున్నాడు. వెంటనే రిజ్వానా అతని కళ్లకు గంతలు కట్టింది. అనంతరం రిజ్వానా భర్త ఇమ్రాన్ వచ్చి కత్తితో పఠాన్ దారుణంగా పొడిచారు. వీరి దాడిలో పఠాన్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఇక ఆ రోజు నుంచి పఠాన్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతని ఆచూకి కోసం గాలించారు. ఈ క్రమంలోనే ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు అతని స్నేహితుడైన ఇమ్రాన్ అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో ఇమ్రాన్ అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులైన ఇమ్రాన్, రిజ్వానాను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. భార్యపై మోజుపడ్డాడని అతడిని స్నేహితుడిని చంపిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.