రాధా హత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు రాధాను హత్య చేసింది కాశీరెడ్డి అని పోలీసులు అనుమానించారు. కానీ, ఈ కేసు ఊహించని ములుపు తిరగడంతో చివరికి నిందితుడు భర్త మోహన్ రెడ్డి అని పోలీసులు తేల్చారు. అసలు నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలుసా?
ఏపీలో సంచలనం సృష్టించిన రాధా హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేదించారు. ఇన్ని రోజులు రాధాను హింసించి హత్య చేసింది ఆమె స్నేహితుడు కాశీరెడ్డి అని మృతురాలి కుటుంబ సభ్యులతో పోలీసులు కూడా అనుమానించారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులకు కాస్త అనుమానం రావడంతో మృతురాలి భర్తను విచారించడంతో కేసు ఊహించని ములుపుకు తిరిగింది. రాధాను చంపింది కాశీరెడ్డి కాదని, ఆమె భర్తేనని పోలీసులు తెలిపారు. అసలు ఇంతకు నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో రాధా హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే రాధాను చంపింది అప్పు తీసుకున్న కాశీరెడ్డి అని పోలీసులు అనిమానించారు. కానీ, పోలీసులు తాజా విచారణలో మాత్రం.. రాధాను చంపింది ఆమె భర్త మోహన్ రెడ్డి అని పోలీసులు సంచలన నిజాలను బయటపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ నెల 17న డబ్బు ఇస్తానంటూ కాశీరెడ్డి పేరుతో ఓ మేసేజ్ రావడంతో అది నిజమే అనుకుని రాధా బయటకు వెళ్లి శవమై కనిపించింది.
అసలేం జరిగిందంటే?
తెలంగాణలోని కోదాడకు చెందిన మోహన్ రెడ్డి, ప్రకాశం జిల్లా కనిగిరి చెందిన రాధాకు గతంలో వివాహం జరిగింది. భార్యాభర్తలు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ నగరంలోనే కాపురం పెట్టారు. భార్యాభర్తలు ఇద్దరూ ఐటీ ఉద్యోగులు కావడంతో బాగానే సంపాదిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే, రాధా చిన్ననాటి స్నేహితుడైన కాశీరెడ్డి అనే వ్యక్తికి మోహన్ రెడ్డి, రాధా రూ.80 లక్షలు అప్పుగా ఇచ్చారు. చాలా రోజులు కావడంతో కాశీరెడ్డిని మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ కోరాడు. దీనికి కాశీరెడ్డి ఇస్తానంటూ కాలాన్ని వెల్లదీశాడు. ఈ క్రమంలోనే రాధా స్నేహితుడైన కాశీరెడ్డికి మద్దతుగా మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మోహన్ రెడ్డి.. రాధాకు, కాశీరెడ్డికి సన్నిహిత సంబంధం ఉందని అనుమానించాడు. ఈ కారణంతోనే మోహన్ రెడ్డి భార్య రాధాను హత్య చేయాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు.
భార్యకు హత్యకు భర్త ప్లాన్:
భార్యకు కాశీరెడ్డితో సన్నిహిత సంబంధం ఉందనే అనుమానంతో మోహన్ రెడ్డి రాధాను చంపాలని అనుకున్నాడు. ఇందుకోసం ఆమె హత్యకు కంటే 15 రోజుల ముందే మోహన్ రెడ్డి ప్లాన్ గీసుకున్నాడు. ముందుగా కాశీరెడ్డి పేరు మీద అతడు ఓ సిమ్ కార్డ్ కొనుగోలు చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 17న రాధా కనిగిరిలోని తన పుట్టింటికి వెళ్లింది. మోహన్ రెడ్డి కూడా వెళ్లాడు. అయితే, మోహన్ రెడ్డి సూర్యాపేటలో చెరుకు రసం అమ్మే వ్యక్తి వద్ద ఫోన్ తీసుకున్నాడు. అతనితో ఫోన్ లో కాశీరెడ్డి పేరు మీద తీసుకున్న సిమ్ వేసి రాధాకు మెసేజ్ లు చేశాడు. ఆ తర్వాత పల్నాడు వెళ్లగానే మరో ఫోన్ లో ఆ సిమ్ వేసి రాధాతో ఛాటింగ్ చేశాడు. ఇక ఈ నెల 17న మోహన్ రెడ్డి కనిగిరి వెళ్లగానే ఓ యువతి ఫోన్ లో సిమ్ వేసి కనిగిరి వచ్చానని, వస్తే డబ్బులు ఇస్తానంటూ నమ్మించాడు.
ఇవన్నీ మెసేజ్ లు కాశీరెడ్డి నుంచే వస్తున్నాయని రాధా భావించింది. భర్తే చేస్తున్నాడని మాత్రం గుర్తించలేకపోయింది. ఇక అతడు చెప్పిన చోటుకు వెళ్లగానే రాధాను కొందరు వ్యక్తులు దారుణంగా హింసించారు. ఆమె దాడి చేస్తూ సిగరెట్లతో కాల్చి కాళ్లు, చేతులు విరగొట్టారు. అనంతరం హత్య చేసి కారుతో తొక్కించారు. ఇక చాలా సేపు అయినా రాధా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు రాధా హత్యకు గురైందని గుర్తించారు. అయితే కాశీరెడ్డి పేరు మీద మేసేజ్ లు రావడంతో మృతురాలి కుటుంభ సభ్యులతో పాటు పోలీసులు కూడా కాశీరెడ్డే నిందితుడు అనుమానించారు. కానీ, పోలీసుల విచారణలో మాత్రం నిందితుడు కాశీరెడ్డి కాదని, భర్త మోహన్ రెడ్డి భార్యను హత్య చేయించాడని తేలింది.
మోహన్ రెడ్డిని పట్టించిన గూగుల్ టేకౌట్:
రాధా హత్య కేసును పోలీసులు కాస్త సీరియస్ గా తీసుకున్నారు. మొదట్లో నిందితుడు కాశీరెడ్డే అనుకున్నప్పటికీ విచారణలో మాత్రం నిందితుడు భర్త మోహన్ రెడ్డి అని పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. పోలీసుల విచారణలో భాగంగా మృతురాలి భర్త మోహన్ రెడ్డిని విచారించారు. దీంతో పాటు అతని ఫోన్ కాల్స్ తో పాటు అతడు తిరిగిన ప్రదేశాలను తెలుసుకున్నారు. హత్య జరిగిన రోజు భర్త మోహన్ రెడ్డి కనిగిరిలోనే పోలీసులు తేల్చారు. ఈ క్రమంలోనే అతడు కాశీరెడ్డి పేరు మీద సిమ్ కొనుగోలు చేసినట్లు గుర్తించి గూగుల్ టేకౌట్ ద్వారా నిందితుడు ఎవరో కాదు, రాధా భర్త మోహన్ రెడ్డి అని పోలీసు తేల్చారు. దీంతో మోహన్ రెడ్డి తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉంది? అసలేం జరిగిందనే అసలు నిజాలు పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు.