మద్యం మత్తు మనిషిని ఎంతకైన తెగించేలా చేస్తుంది. ఈ మాటలో ఎలాంటి అవాస్తవం లేదనే చెప్పాలి. అవును.. మద్యం మత్తులో సభ్యసమాజంలోని మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో ఎవరికి అర్థం కానీ పరిస్థితులు దాపరిస్తున్నాయి. ఇటీవల మద్యం మత్తులో కామంతో ఊగిపోయిన ఓ కసాయి తండ్రి కన్నకూతురిపై అత్యాచారినికి దిగిన దారుణమైన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వినటానికి భయంకరంగా ఉన్న ఇది నిజం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని మార్కాపురం మండలంలోని ఓ గ్రామంలో ఓ భార్యభర్తలకు ఓ 15 ఏళ్ల కూతురు ఉంది. అయితే ఆ తండ్రి మద్యం తాగి వస్తూ భార్యను, కూతురిని రోజు వేదిస్తూ ఉండేవాడు. ఇటీవల కాలంలో ఓ రోజు రాత్రి తన ప్రియురాలితో పాటు ఇంట్లో కాపురం పెట్టాడీ దుర్మార్గపు తండ్రి. అదే సమయంలో ఉంట్లో ఉన్న తన కూతురికి బలవంతంగా మద్యం తాగించాడు. ఇక అనంతరం మద్యం మత్తులో ఉన్న తండ్రి కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇక ఇదే దారుణాన్ని తన ప్రియురాలితో వీడియో తియించాడీ కసాయి తండ్రి.
కొంత కాలానికి బాలికలో ఆరోగ్యపరమైన మార్పులు గమనించిన తల్లి కూతురిని అడిగింది. ఏడ్చుకుంటూ తండ్రి చేసిన దారుణాన్ని మొత్తాన్ని చెప్పింది. దీంతో కోపంతో రగిలిపోయిన తల్లి గత నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కన్న కూతురు వద్దు నాన్న ప్లీజ్ అని అరిచి కేకలు పెట్టిన వదలని ఇలాంటి తండ్రి కిరాతకంపై వీడికి ఎలాంటి శిక్ష విధించాలో కామెంట్ రూపంలో తెలియజేయండి.