గతాన్ని తలచుకుని అక్కడే ఆగిపోకు. రేపు ఏం జరుగుతుందో అని ఆలోచిస్తూ కూర్చోకు. ఇవాళ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుని ఆచరించుకుంటూ పోవాలి. అదే జీవితం. కానీ కొంతమందికి చిన్న చిన్న సమస్యలు వచ్చాయని జాతకాలు చూపించుకునే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది దొంగ జ్యోతిష్కులను నమ్మి సర్వం కోల్పోతారు. ఇలా కోల్పోయిన వారిలో హైదరాబాద్ కి చెందిన యువతి ఉంది. చదువు లేని వాళ్ళు మోసపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తున్న ఒక యువతి అంత చదువు చదివి మోసపోయింది. వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియా వేదికగా జ్యోతిష్కుడి ముసుగులో ఒక వ్యక్తి మహిళ వద్ద నుంచి దాదాపు 50 లక్షల దాకా కాజేశాడు.
లవ్ ఆస్ట్రాలజీ పేరుతో మోసం చేసిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్ లోని మొహాలీకి చెందిన లలిత్ అనే వ్యక్తి జ్యోతిష్యం ముసుగులో ఆన్ లైన్ లో మోసాలకు పాల్పడుతున్నాడు. హైదరాబాద్ కి చెందిన సాఫ్ట్ వేర్ మహిళ వద్ద నుంచి ఏకంగా రూ. 47.11 లక్షలు కాజేశాడు. బాధితురాలు గత నెల 19న హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో మోసగాడిపై ఫిర్యాదు చేసింది. మూడు నెలల క్రితం.. ఇన్స్టాగ్రామ్ లో ఆస్ట్రాలజర్ కోసం వెతుకుతుండగా.. గోపాల్ శాస్త్రి (ఆస్ట్రో గోపాల్) పేరుతో ఒక ప్రొఫైల్ కనబడినట్లు ఆమె వెల్లడించింది. అందులో అతని ఫోన్ నంబర్ ఉంటే.. నంబర్ ద్వారా సంప్రదించానని ఆమె వెల్లడించింది.
లవ్ ప్రెడిక్షన్ తెలుసుకునేందుకు మొదట రూ. 32 వేలు ఇచ్చినట్లు ఆమె తెలిపింది. కొన్ని ప్రార్థనలు చేస్తే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పి.. రూ. 47. 11 లక్షల దాకా తనను మోసం చేసి దోచుకున్నాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆమె ఫిర్యాదుని తీసుకున్న పోలీసులు.. లలిత్ పై ఐటీ యాక్ట్ మరియు ఐపీసీ 419, 420 సెక్షన్ల కింద 66 సి & డి కేసు నమోదు చేశారు. నిందితుడి వద్ద ఉన్న 14 విలువైన మొబైల్ ఫోన్లు, రెండు డెబిట్ కార్డులు, చెక్ బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
The #cybercrime sleuths on Monday arrested a Punjab-based fake astrologer who, under the pretext of #loveastrology, cheated several people by collecting money online.#fakeastrologer #astrologerarrestedhttps://t.co/n3wURYSG1Z
— Deccan Chronicle (@DeccanChronicle) December 6, 2022