పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు నాగమణి. గతంలో ఆమె భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి నాగమణి ఉన్న ఇద్దరు కూతుళ్లను చూసుకుంటూ సంసారాన్ని ఈడ్చుకుంటూ వచ్చింది. అయితే నాగమణికి స్థలం వివాదంలో భాగంగా ఆమెకు వైరాకు చెందిన ఓ వ్యక్తితో పాత గొడవలు ఉన్నాయి. ఈ భూ వివాదం పరిష్కారం కోసం నాగమణి ఆమెకు తెలిసిన ఓ వ్యక్తిని సాయం అడిగింది. నాగమణి సాయానికి ఆ వ్యక్తి సరే అన్నాడు. కానీ, ఇక్కడ ఓ కండీషన్ పెట్టి చివరికి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏలూరు జిల్లా చింతలపూడిలోని ఎస్ బీఐ నగర్. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో నాగమణి (37)తో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం తర్వాత ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు జన్మించారు. అయితే కొంత కాలం తర్వాత నాగమణి భర్త మరణించాడు. దీంతో అప్పటి నుంచి నాగమణి తన ఇద్దరు కూతుళ్లను చూసుకుంటూ వస్తుంది. ఇదిలా ఉంటే ఖమ్మం జిల్లాలోని వైరాకు చెందిన శ్రీనివాసరావుతో నాగమణికి స్థల వివాదం నడుస్తుంది. ఈ వివాదం పరిష్కారం కోసం నాగమణి అనేక సార్లు కోర్టుల చుట్టు తిరిగింది. అయినా.. ఆ సమస్య పరిష్కారానికి ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు.
అయితే ఈ వివాదం పరిష్కారం కోసం.. నాగమణి తనకు తెలిసిన రాంబాబు అనే వ్యక్తిని కలిసి సమస్యను వివరించింది. ఇదే విషయంపై నాగమణి అనేకసార్లు రాంబాబును సాయం చేయాలని కోరింది. అలా తరుచు కలవడంతో రాంబాబు నాగమణితో వివాహేతర సంబంధాన్ని నడిపించి ఆమెతో కోరికలు తీర్చుకున్నాడు. అయితే నాగమణి పట్టుబట్టడంతో రాంబాబు ఓ రోజు వైరాకు చెందిన శ్రీనివాసరావుతో కలసి మాట్లాడాడు. ఈ క్రమంలోనే శ్రీనివాసరావు.. రాంబాబుకు ఓ ఆఫర్ ఇచ్చాడు. నాగమణిని అడ్డుతప్పిస్తే.. నీకు 6 గుంటల భూమితో పాటు రూ. 2 లక్షలు ఇస్తానని హామీ చెప్పాడు. దీనికి రాంబాబు కూడా సరే అన్నాడు. ఇక వీరి పథకంలో భాగంగా గత నెల 19న రాంబాబు నాగమణిని కాకినాడలోని ఓ లాడ్జీకి తీసుకెళ్లాడు.
ఆ తర్వాత ఆ లాడ్జీకి శ్రీనివాసరావు కూడా వచ్చారు. ఆ రోజు రాత్రి రాంబాబు, శ్రీనివాసరావు ఇద్దరూ కలిసి.. అదే లాడ్జీలో నాగమణిని రాడ్డుతో కొట్టి చంపారు. అనంతరం నాగమణి శవాన్ని ఓ సంచిలో ముటకట్టి గత 21న తెలంగాణలోని దమ్మపేట పరిధిలోని డింపింగ్ యార్డ్ వద్ద ఆ మృతదేహాన్ని తగలబెట్టారు. అప్పటి నుంచి నాగమణి కనిపించకపోవడంతో ఆమె సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రాంబాబుపై పోలీసులకు అనుమానం రావడంతో అతడిని విచారించారు. ఇక పోలీసుల విచారణలో రాంబాబు అసలు నిజాలు బయటపెట్టాడు. అనంతరం పోలీసులు నిందితులు రాంబాబుతో పాటు శ్రీనివాసరావును సైతం అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.