Doctor Crime On Pregnant Woman In Brazil: వైద్య వృత్తికే కలంకం తెచ్చేలా ప్రవర్తించాడో డాక్టర్. డెలివరీ కోసం వచ్చిన వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చిన తర్వాత వారితో లైంగిక కోర్కెలు తీర్చుకున్నాడు. ఓ వైపు ఆపరేషన్ జరుగుతుండగానే మరో వైపు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు పాపం పండి కటకటాలపాలయ్యాడు. ఈ సంఘటన బ్రెజిల్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
బ్రెజిల్‌లోని రియో డి జెనెరియోకు చెందిన 32 ఏళ్ల గియోవన్నీ క్విన్‌టెల్లా బెజెర్రా అక్కడి ‘హెలోనీడా స్టూడర్ట్ ఉమెన్స్ హాస్పిటల్’లో అనస్థీషియా స్పెషలిస్ట్‌గా పని చేస్తున్నాడు. కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు ఎక్కువ మోతాదులో అనస్థీషియా ఇస్తుండటంతో ఆపరేషన్ చేసే డాక్టర్లకు అనుమానం వచ్చింది. బెజెర్రా ఏం చేస్తున్నాడో తెలుసుకోవటానికి ఆదివారం ఆపరేషన్ థియేటర్‌లో సీక్రెట్ కెమెరా పెట్టాలనుకున్నారు. కానీ, అలా చేయటం కుదరలేదు.
రెండు డెలివరీలు చేసిన తర్వాత ఆపరేషన్ థియేటర్ వేరే రూమ్‌కు మార్చబడింది. అక్కడ ముందుగా అనుకున్నట్లుగానే థియేటర్ టెక్నీషియన్స్ సహాయం సీసీ కెమెరా సెట్ చేయించారు. మూడో గర్భిణికి ఆపరేషన్ మొదలైంది. బెజెర్రా గర్భిణికి అనస్థీషియా ఇచ్చాడు. తర్వాత ఆపరేషన్ జరుగుతున్న పొట్టకు, తలకు మధ్య ఓ కర్టెన్ కట్టారు. కర్టెన్ కారణంగా ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లకు తల వైపు ఏం జరుగుతోందో కనిపించదు.
కొన్ని గంటల తర్వాత ఆపరేషన్ పూర్తయింది. మహిళను వేరే రూముకు మార్చారు. ఆ తర్వాత బెజెర్రా తోటి డాక్టర్లు థియేటర్‌లో అమర్చిన సీసీ కెమెరా ఫొటేజీలను తెప్పించుకున్నారు. ఆ సీసీటీవీ దృశ్యాలను చూసి వారు నిశ్చేష్టులయ్యారు. కర్టెన్‌కు ఓ వైపు ఆపరేషన్ జరుగుతుంటే.. మరో వైపు గర్భిణి తల భాగంలో బెజెర్రా అత్యాచారానికి పాల్పడుతున్నాడు.
దీంతో వారు వెంటనే హాస్పిటల్ యజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అత్యాచారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం బెజెర్రాను అరెస్ట్ చేశారు. అతడు ఒకే రోజు ముగ్గురు గర్భిణులపై అత్యాచారం చేసినట్లు గుర్తించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 11 మందిని పెళ్లాడిన నిత్య పెళ్లికొడుకు గుట్టు రట్టు!