గతంలో టమాటాలకు సరైన గిట్టుబాటు ధర రాక.. రోడ్డు పైనే రైతులు పారపోసేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల టమాటాలకు బాగా డిమాండ్ పెరిగింది. టమాటా రేటు కూడా మార్కెట్‌లో వంద రూపాయలను దాటేసింది.
టమాటాలు లేని వంటిళ్లు ఉండదు.. అలాగే కూర కూడా కాదు. గతంలో టమాటాలకు సరైన గిట్టుబాటు ధర రాక.. రోడ్డు పైనే రైతులు పారపోసేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే ఇటీవల టమాటాలకు బాగా డిమాండ్ పెరిగింది. కిలో టమాటా రేటు కూడా మార్కెట్‌లో వంద రూపాయలను దాటేసింది. రైతులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇదే సమయంలో కొంత మంది దారుణాలకు ఒడిగడుతున్నారు. మొన్నటికి మొన్న కర్ణాటకకు చెందిన రైతుల తోటల్లో చొరబడి.. రూ. 2.5 లక్షల విలువ చేసే టమాటాను దొంగిలించిన సంగతి తెలిసిందే. ఆ రైతులు కన్నీరు మున్నీరు అయ్యారు. టమాట ధరతో లాభాలను చూసిన ఓ రైతు.. ఆ ఆనందాన్ని ఆనందించకుండా బలితీసుకున్నారు దుండగులు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం బోడిమల్లదిన్నెకు చెందిన రైతు నారెం రాజశేఖర్ రెడ్డి.. తనకున్న పొలంలో టమాటా పంట పండిస్తున్నాడు. పిల్లలకు పెళ్లై, బెంగళూరులో ఉంటున్నారు. ఇటీవల టమాటాలకు భారీగా డిమాండ్ పెరగడంతో రాజశేఖర్ తన భార్యతో కలిసి పొలంలోనే నివాసముంటున్నాడు. రాజశేఖర్‌రెడ్డి ఇప్పటికే ఐదు కోతలు టమాటాలు కోసి అంగళ్లులో ఉన్న మార్కెట్‌లో విక్రయించారు. మంగళవారం కూడా 70 ట్రేల టమాటాలను తీసుకువచ్చి అమ్మారు. అయితే అదే రోజు పాలు పోసేందుకు వెళ్లాడు. ఎంత సేపటికి తిరిగిరాకపోవడంతో భార్య జ్యోతికి అనుమానం వచ్చి కుమార్తెలకు విషయం చెప్పింది.
తండ్రికి ఫోన్ చేసిన తీయకపోవడంతో స్థానికులు వెతకడం మొదలు పెట్టారు. చివరికీ ఓ చెట్టు దగ్గర చేతులు, కాళ్లు కట్టేసి నిర్జీవ స్థితిలో కనిపించాడు రైతు. అప్పటికే అతడి ప్రాణాలు పోయాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే టమాటా అమ్మగా వచ్చిన డబ్బుల కోసమే రైతులు ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అతడి మెడకు టవల్ చుట్టి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. విచారణలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి టమాటాలు కావాలని, రాజశేఖర్ ఎక్కడున్నాడని భార్య జ్యోతిని అడిగనట్టు తెలిసింది. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్లిపోయారట. ఈ హత్య కేవలం టమాటా అమ్మిన డబ్బుల కోసమేనా, మరే కారణాలున్నాయన్న కోణంలో విచారిస్తున్నారు.