ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. చికాగోలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
చికాగోలో ఆదివారం రోడ్డు పై తెల్లవారుజామున 5:00 గంటల సమయంలో కొంత మంది గుంపుగా గొడవ పడుతున్నారు. అదే సమయానికి ఓ కారు అత్యంత వేగంగా వచ్చి గొడవ పడుతున్న వారిపై నుంచి దూసుకు వెళ్లింది. దాంతో ఓ వ్యక్తి పక్కన పడిపోగా.. మరో ముగ్గురు మాత్రం గాల్లో ఎగిరి అల్లంత దూరాన పడిపోయారు. ఈ వీడియో చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచే విధంగా కనిపిస్తుంది. హిట్ అండ్ రన్‌కు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీస్ అధికారులు తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికాగో ఆసుపత్రికి తరలించగా ముగ్గురు మరణించారు. మరో వ్యక్తి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని.. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా ఇలాంటి వారిలో మార్పు రావడం లేదని పోలీస్ అధికారులు అంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Warning: Graphic video.
3 dead, 1 injured after a driver appears to intentionally strike a group of men in the street near 71st and Jeffery in #Chicago around 5 a.m. Sunday. Offender remains at large. pic.twitter.com/wa2ZNFW1FB
— CWBChicago (@CWBChicago) August 14, 2022
ఇది చదవండి: ఖమ్మంలో దారుణం.. సర్పంచ్ దంపతులపై క్షద్రపూజలు!
ఇది చదవండి: 40 నిమిషాల నరక వేదన.. కాపాడాలని వేడుకుంటూనే..