‘‘ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం’’ అన్నాడు ఓ సినీ రచయిత. అభినందన సినిమాలో హీరో తనకు బ్రేకప్ చెప్పి వేరే పెళ్లి చేసుకున్న హీరోయిన్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఆమె ఆలోచనలతోనే ప్రతి క్షణం జీవిస్తూ ఉంటాడు. ఆ బాధతోనే ఈ పాట పాడతాడు. అది సినిమా కాబట్టి.. పాటలతో తన బాధను వ్యక్త పరచాడు హీరో. కానీ, నిజ జీవితంలో అలా కాదు. టూ సైడ్ లవ్‌లో ఉన్న అమ్మాయి బ్రేకప్ చెబితే.. వచ్చే బాధకు ప్రాణం పోతున్నట్లు ఉంటుంది. ఈ బాధను భరించటం చాలా కష్టం. చాలా కొద్ది మంది మాత్రమే బ్రేకప్ గాయం నుంచి బయటపడతారు.
మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. అలాంటి వారిలో రోహిత్ కూడా ఒకడు. ఇతడు ఓ అమ్మాయితో ఆరేళ్లు ప్రేమలో ఉన్నాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు. కానీ, ఏదో గొడవ కారణంగా ఆమె బ్రేకప్ చెప్పింది. దీంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరు, ఉళ్లాలకు చెందిన 25 ఏళ్ల రోహిత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి గత ఆరేళ్లుగా పోటాపోటీగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్‌కు, అతడి ప్రియురాలికి ఏదో విషయంలో గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా ఆరేళ్ల ప్రేమకు ఆ యువతి నీళ్లు వదిలేసింది.
బ్రేకప్ చెప్పిన తర్వాత రోహిత్‌తో మాట్లాడటం మానేసింది. దీంతో రోహిత్ మనసు తట్టుకోలేకపోయింది. ఆమెను ఎంతో బ్రతిమాలాడు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తనకు ఆత్మహత్యే శరణ్యం అని భావించాడు. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రోహిత్ ఇంటికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.