సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి కొందరు దంపతులు దారుణాలకు తెగబడుతున్నారు. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ కనిపెంచిన పిల్లలను అనాధలను చేసి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజం. కానీ, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సింది పోయి కొందరు దంపతులు దారుణాలకు తెగబడుతున్నారు. క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ కనిపెంచిన పిల్లలను అనాధలను చేసి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలో ఓ భర్త భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు భర్త భార్యను ఎందుకు హత్య చేశాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందంటే?
ఏపీలోని బాపట్ల జిల్లా పంగులూరు మండలం దామకూరు గ్రామం. ఇక్కడే పావులూరు శ్రీనివాస్-నాగసునిత (34) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరిదీ ఒకే ఊరు కావడం విశేషం. అయితే పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్నేళ్ల తర్వాత ఈ భార్యాభర్తలకు ఇద్దరు కుమారులు జన్మించారు. ఇక వీరి సంసారం సంతోషంగా సాగుతుందన్న తరుణంలోనే ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఇరువురి కుటుంబ సభ్యులు కలగజేసుకుని పంచాయితీ పెట్టించారు. అంతేకాకుండా ఇటీవల లోక్ అదాలత్ వరకు వెళ్లి చివరికి రాజీకొచ్చారు.
ఇక అప్పటి నుంచి భర్త భార్యపై మరింత కోపంతో రగిలిపోయాడు. తరుచు భార్యతో గొడవలు పడడం, కొట్టడం చేస్తుండేవాడు. ఇదిలా ఉంటే ఇటీవల శ్రీనివాస్ భార్యతో మరోసారి గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక క్షణికావేశంలో ఊగిపోయిన భర్త.. భార్యను హత్య చేసి పరారయ్యాడు. సాయంత్రం పిల్లలు ఇంటికొచ్చి చూసేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉంది. ఈ సీన్ చూసిన పిల్లలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. స్థానికుల సమాచారంతో అమ్మమ్మకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న నాగసునీత తల్లిదండ్రులు కూతురిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. క్షణికావేశంలో భార్యను హత్య చేసిన భర్త దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.