సాధారణంగా సంఘవిద్రోహ శక్తులను పట్టిస్తే రివార్డులు ఇస్తామని మనం పేపర్లలో, పోస్టర్లలో చూస్తూనే ఉంటాం. అదీకాక పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుండే హంతకులపై కూడా రివార్డులు ప్రకటిస్తారు. కానీ ఓ దేశానికి చెందిన పోలీసులు మరో దేశానికి చెందిన వ్యక్తిపై రివార్డులు ప్రకటించిన సందర్భాలు చాలా అరుదు. ఇలా ఓ దేశానికి చెందిన వ్యక్తిపై ఆస్ట్రేలియా రూ. 5 కోట్ల భారీ రివార్డును ప్రకటించింది. ఆ వాంటెడ్ వ్యక్తి భారతీయుడు కావడం గమనార్హం. 2018లో ఆస్ట్రేలియాలో ఓ మహిళను హత్య చేసిన కేసులో ఇతడిపై కేసు నమోదు అయ్యింది. థ్రిల్లర్ మూవీని తలపించే ఈ కథ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆస్ట్రేలియా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారత్ కు చెందిన రాజ్ విందర్ సింగ్(38) అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ ఇన్నీస్ ఫైల్ లో నర్సుగా పనిచేస్తున్నాడు. 2018లో అక్టోబర్ లో తోయా కార్డింగ్ లీ అనే మహిళను హత్య చేశాడు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే రెండు రోజుల్లోనే ఫ్యామిలీని, ఆస్ట్రేలియాను వదిలి పారిపోయాడు. అతడు ఎక్కడికి వెళ్లాడో.. ఏం చేస్తున్నాడో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. నాలుగు సంవత్సరాల నుంచి ఆసిస్ పోలీసులకు దొరకకుండా తిరుగుతూ.. వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఎంత ప్రయత్నించి నప్పటికీ అతడి ఆచూకీని మాత్రం కనిపెట్టలేక పోతున్నారు.
A $1 million reward for information from the public has been announced as part of ongoing investigations into the 2018 murder of 24-year-old Toyah Cordingley in Far North Queensland.
🔗 https://t.co/siReX5piE2 pic.twitter.com/zpwODZIj3c
— Queensland Police (@QldPolice) November 2, 2022
తాజాగా అక్టోబర్ 22న కైర్స్ నుంచి ఇండియాకు రాజ్ విందర్ వచ్చినట్లు ఆసిస్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆసిస్ పోలీసులు అతడి ఫోటోను ట్వీటర్ ద్వారా షేర్ చేశారు. అదీ కాక ఈ వాంటెడ్ పై (1 మిలియన్ డాలర్లు) రూ.5 కోట్ల భారీ రివార్డును సైతం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఇతడి కోసం హిందీ, పంజాబీ మాట్లాడో పోలీసులు అధికారులను సైతం నియమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నాలుగు సంవత్సరాలుగా.. ఆస్ట్రేలియా పోలీసులనే ముప్పుతిప్పలు పెడుతున్న రాజ్ విందర్ పై ఇంత భారీ మెుత్తంలో రివార్డ్ ప్రకటించడంతో.. దేశం మెుత్తం ఈ కేసు గురించే చర్చించుకుంటున్నారు.