వివాహాతేర సంబంధాల వల్ల ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయో నిత్యం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆడవారు.. పరాయి వ్యక్తిపై మొజు పడి.. తాత్కలిక సుఖం కోసం భర్తను.. అవసరమనుకుంటే పిల్లలను సైతం కడతేరుస్తున్నారు. అయితే నేరం చేసిన వారు తప్పించుకోలేరు అనే చిన్న లాజిక్‌ను మిస్ అవుతున్నారా.. లేక ఆ జైలుకెళ్తే ఏం అవుతుంది అని భావిస్తున్నారో తెలియదు కానీ.. చేజేతులా బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా.. అభంశుభం తెలియని చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు చేసే ఇలాంటి పనికిమాలిన పనులు.. పిల్లల జీవితాలను ఎంత ప్రభావితం చేస్తాయో మర్చిపోతున్నారు. తాజాగా ప్రియుడిపై మోజుతో ఓ మహిళ చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె మీద ఏమాత్రం అనుమానం రాకుండా నటించిన తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు. మహానటి.. ఇక మిగతా సమయం అంతా జైల్లో నటిద్దువుగాని పద అంటూ అరెస్ట్ చేశారు. ఆ వివరాలు..
ఈ సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. ఎంవీపీ కాలనీ సమీప వావవానిపాలేనికి చెందిన జ్యోతికి ఆరేళ్ల క్రితం భీమిలి మండలం వలందపేటకు చెందిన వంకా పైడిరాజుతో వివాహం అయ్యింది. వీరికి బాలాజీ, హర్షిత అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక పైడిరాజు టైల్స్ పని చేసేశాడు. అయితే జ్యోతికి పెళ్లికి ముందు నుంచే నూకరాజుతో పరిచయం ఉంది. ప్రేమించుకున్నారు.. కానీ వివాహం చేసుకోలేదు. అయితే గత కొంత కాలం నుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉండటం ప్రారంభించారు. అయితే అత్తగారింట్లో కలుసుకోవడం కష్టమని భావించి.. విశాలాక్షినగర్‌లో ఓ గది రెంట్‌కు తీసుకున్నారు.
ఆ తర్వాత జ్యోతి.. సీబీఐ ఆఫీస్‌లో హౌస్‌కీపింగ్ పని చేస్తున్నాను అంటూ ఇంట్లో వాళ్లను నమ్మిస్తూ.. గత ఆరు నెలలుగా ప్రతి రోజు.. ప్రియుడి గదికి వెళ్లి.. రాత్రికి ఇంటికి వచ్చేది. అయితే ఇంకెన్నాళ్లు ఇలా దూరంగా ఉండాలి.. భర్తను అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో శాశ్వతంగా కలిసి ఉండవచ్చు కదా అని భావించింది. దానిలో భాగంగా.. జ్యోతి, నూకరాజు.. ఇద్దరు కలిసి పైడిరాజును హత్య చేసేందుకు పథకం రచించారు. దానిలో భాగంగా.. డిసెంబర్ 29న పైడిరాజుకు ఆహారంలో నిద్రమాత్రలు కలిపి పెట్టింది జ్యోతి. తర్వాత రాత్రి ఒంటిగంట సమయంలో.. నూకరాజుకు కాల్ చేసింది. అతడు తన బంధువు భూలోకతో కలిసి వచ్చి.. మత్తులో ఉన్న పైడిరాజు మెడకు తీగ బిగించి హత్య చేశారు. ఆ తర్వాత పైడిరాజు డెడ్ బాడీని విశాలాక్షినగర్‌లోని తమ రూమ్‌కు తరలించారు.
ఇక తెల్లవారుజామున అంబులెన్స్‌కి కాల్ చేసి.. తన స్నేహితుడికి బాగాలేదు.. త్వరగా వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు నూకరాజు. దాంతో 108 సిబ్బంది వచ్చి.. పైడిరాజును పరిశీలించి.. అతడు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. అయితే పైడిరాజుకు తాను తప్ప ఎవరూ లేరని.. నమ్మించి అంబులెన్స్‌లోనే.. పైడిరాజు మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి.. దహనం చేశాడు నూకరాజు. బూడిదను సముద్రంలో కలిపాడు. ఇక మరుసటి రోజు.. జ్యోతి డ్రామా ప్రారంభించింది. తన భర్త మిస్సయ్యాడంటూ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త లేకపోతే.. తాను, బిడ్డలు ఎలా బతుకుతామని.. ఓ రేంజ్‌లో యాక్ట్ చేసింది.
అయితే పైడిరాజు సోదరులు.. జ్యోతి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు జ్యోతి సీబీఐ కార్యాలయంలో పనిచేయడం లేదని తెలిసింది. ఇక ఆమె కాల్ లిస్ట్ చెక్ చేయగా.. మొత్తం బండారం బయటపడింది. పోలీసులు జ్యోతి, నూకరాజులను అరెస్ట్ చేశారు. ప్రియుడి మీద మోజుతో.. పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించకుండా దారుణానికి ఒడిగట్టింది జ్యోతి. పోని తనేమైనా సంతోషంగా ఉంటుందా అంటే.. జైలు జీవితం గడపాల్సిందే. తాత్కలిక సుఖం కోసం బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసిన జ్యోతి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.