సమాజంలో సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా భద్రత కరువవుతోంది. వేధింపులు, బ్లాక్ మెయిల్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళ.. ఇలానే వేధింపుల పర్వానికి తెర తీసింది. ఏకంగా డిప్యూటీ సీఎం భార్యనే బెదిరించింది. ఆ వివరాలు..
ఈమధ్య కాలంలో కేటుగాళ్లు.. ఎంతలా బరి తెగిస్తున్నారంటే.. సామాన్యులనే కాక సినీ, రాజకీయ సెలబ్రిటీలను కూడా బురిడి కొట్టిస్తున్నారు. మరి కొందరు ఏకంగా ఓ అడుగు ముందుకు వేసి సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేసి.. డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చిండి. డిప్యూటీ సీఎం భార్యను ఒక డిజైనర్ బెదిరించింది. ఏకంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. డిప్యూటీ సీఎం భార్య వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. దాంతో డిప్యూటీ సీఎం భార్య.. పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాలు..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య అమృత ఫడ్నవీస్ ఇలా బెదిరింపులు ఎదుర్కొన్నారు. ఆమెకు వ్యక్తిగత డిజైనర్‌గా పని చేసే అనిక్ష జైసింఘానీ అనే మహిళ.. ఇలా బెదిరింపులకు పాల్పడ్డారు. తనకు రూ. 10 కోట్లు ఇవ్వాలని.. లేదంటే అమృతకు చెందిన వీడియోలను వైరల చేస్తానని డిజైనర్ అనిక్ష జైసింఘానీ బెదిరింపులకు పాల్పడ్డట్లు అమృత పోలీసులకు తెలిపారు. దాంతో అనిక్ష జైసింఘానీ మీద పోలీసులు బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేశారు. అయితే కొన్ని రోజుల క్రితమే పోలీసులు అనిక్ష మీద ఓ కేసు నమోదు చేశారు. అది కూడా అమృత ఫడ్నవీస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకే.
అనిక్ష జైసింఘానీ గత 16 నెలలుగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌కు డిజైనర్‌గా వ్యవహరిస్తుంది. అయితే అనిక్ష తండ్రి అనిల్ జైసింఘానీ.. పేరు మోసిన అంతర్జాతీయ క్రికెట్ బుకీ. ఐపీఎల్ సమయంలో కోట్ల రూపాయలతో బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం వారికి భారీగా లంచాలు ఇస్తాడు. అయితే ఇలా పోలీసులకు నజరానాలు ఇచ్చే సమయంలో వాటిని వీడియో తీసి.. ఆ తర్వాత పోలీసులనే బెదిరిస్తుంటాడు. ఇతడికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అనిల్ దగ్గర ఖరీదైన పెంపుడు కుక్కలు ఉండేవి. కేసు విచారణకు పోలీసులు అతడి ఇంటికి వస్తే.. వారి మీదకు కుక్కలు వదిలేవాడని లోకల్ మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. బెట్టింగ్ విషయంలో అనిల్‌కు రాజకీయ అండదండలున్నాయి. ఇప్పటి వరకు అతడిపై 15 కేసులు నమోదయ్యాయి. ఇక గత 8 ఏళ్లుగా అతడు పరారీలో ఉన్నాడు.
ఇదిలా ఉంచితే అనిల్ కుమార్తె అనిక్ష.. అమృత ఫడ్నవీస్‌కు డిజైనర్‌గా చేరింది. ఆమెకు లంచం ఇచ్చి.. తన తండ్రి మీద ఉన్న కేసులను మాఫీ చేయించాలని భావించింది అనిక్ష. ఈ క్రమంలో అమృత ఫడ్నవీస్‌కు కోటి రూపాయలు లంచం ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అమృత ముందు ఈ ప్రతిపాదనను పెట్టింది. అయితే అమృత అనిక్ష మీద సిరీయస్ అవ్వడమే కాక పోలీసులుకు ఫిర్యాదు చేసింది. దాంతో అనిక్ష, ఆమె తండ్రి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎఫ్‌ఐఆర్ బుక్ అయిన రెండు రోజుల తర్వాత అనిక్ష.. తన తండ్రి వినియోగించే టెక్నిన్‌ని వాడి అడ్డంగా బుకయ్యింది.
అనిక్ష మీద కేసు నమోదు అయిన రెండు రోజుల తర్వాత ఆమె అమృతకు రెండు వీడియోలు పంపింది. వీటిల్లో డబ్బు ఉన్న బ్యాగ్‌లను అమృతకు ఇస్తున్నట్లుగా ఉంది. తనకు 10 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. ఈ వీడియోలను లీక్ చేసి.. వైరల్ చేస్తానని అనిక్ష.. అమృతను బెదిరించింది. ఈ బ్లాక్ మెయిల్ గురించి అమృత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అనిక్ష మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీడియోలను పరిశీలింగా.. అవి మార్ఫింగ్ చేసిన వీడియోలుగా తేలింది. దాంతో అనిక్ష బలవంతపు వసూళ్లకు పాల్పడినట్లుగా తేలింది. ఆమె మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. వీడియోలు క్రియేట్ చేసిన వారి కోసం గాలిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.