Crime News : చిన్న పిల్లలకు ఏది ఆడుకునే వస్తువో.. ఏది ప్రాణం తీసే వస్తువో సరిగా తెలీదు. పెద్దలు చేసే పనిని వాళ్లు రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే పెద్ద ఘోరాలు జరుగుతూ ఉంటాయి. ఓ మూడేళ్ల పిల్లాడు తండ్రి కారులో ఉన్న గన్ను చేతుల్లోకి తీసుకుని తల్లిని చంపేశాడు. అతడు గన్‌తో ఆడుకుంటూ ఈ పని చేశాడు. ఈ సంఘటన ఆమెరికాలోని చికాగోలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగోకు చెందిన డేజా బెన్నెత్ ఆమె భర్త, మూడేళ్ల పిల్లాడితో కలిసి శనివారం సాయంత్రం డాల్టన్లోని సూపర్‌మార్కెట్‌కు వెళ్లింది.

మార్కెట్ పార్కింగ్ ప్లేసులో ముగ్గురు కారులో కూర్చుని ఉన్నారు. బాలుడు వెనకాల ఉన్న పిల్లల సీట్లో కూర్చోగా.. తల్లిదండ్రులు ముందర ఉన్నారు. మరి తుపాకి అక్కడ ఎక్కడ ఉండిందో తెలీదు. బాలుడు దాన్ని చేతుల్లోకి తీసుకుని ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో గన్ ట్రిగ్గర్ నొక్కటంతో గుండు తల్లి మెడలోకి దూసుకు పోయింది. అది గమనించిన ఆమె భర్త వెంటనే చికాగో ఆస్పత్రికి తీసుకెళ్లాడు. డేజా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పిల్లాడి తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కోడలి శీలాన్ని అమ్మేసిన అత్త! ఇంత దారుణమా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.
