అమర్ నాథ్ యాత్ర అంటేనే కష్టాలతో కూడుకొని ఎంతో ధైర్యంతో వెళ్లాల్సిన తీర్థయాత్ర అని అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రలో పలు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ మద్య భారీ వరదలు.. ప్రకృతి సృష్టించిన బీభత్సానికి 16 మంది చనిపోయిన విషాద ఘటన గురించి తెలిసిందే. తాజాగా అమర్ నాథ్ యాత్రకు వస్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరి వెంటనే హిస్పిటల్ కి తరలించారు. వివరాల్లోకి వెళితే..
ఇటీవల కాశ్మీర్ లోయలో వరుసగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో అమర్ నాథ్ యాత్రను కొన్ని రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడ ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రెండు సార్లు యాత్ర వాయిదా పడింది. ఈ క్రమంలోనే బస్సు ప్రమాదానికి గురి కావడం జరిగింది.
గత కొన్ని రోజులుగా కాశ్మీర్ లోయలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసిన రోజున ఈ ప్రమాదం జరిగింది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే రెండుసార్లు యాత్ర వాయిదా పడింది. ఈ క్రమంలో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది.
అమర్ నాథ్ యాత్రకు బయలు దేరిన బస్సు రోడ్డు దాటుతున్న సమయంలో ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉండగా.. అందులో పదిహేను మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే వారిని అనంత్ నాగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టం కొద్ది ఈ ప్రమాదంలో భక్తులకు కొద్దిపాటి గాయలు అయ్యాయి గానీ ఎటువంటి ప్రాణ నష్టం కలుగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి
ఇది చదవండి: Nityananda Statue: 18 అడుగుల నిత్యానంద స్వామి విగ్రహం.. ఎక్కడంటే!