భారతదేశంలో విద్యార్థుల్లో చాలా ప్రతిభ దాగివుంది. కానీ అనుకోని పరిస్థితులు వల్ల, ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఎంతో మంది పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇలాంటి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు దేశీయ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన SBI స్కాలర్ షిప్ లను అందించడానికి ముందుకు వచ్చింది. “SBI ఆశా స్కాలర్ షిప్ 2022” పేరుతో పేద విద్యార్థులకు ఈ అవకాశం అందిస్తోంది. ఈ స్కీమ్ ని SBI, బడ్డి4స్టడీ అనే మరో ఫౌండేషన్ తో కలిసి సంయుక్తంగా అందిస్తోంది. ఈ వార్తకు సంబంధంచి మరిన్ని వివరాల్లోకి వెళితే..
SBI..తన దాతృత్వ గుణాన్ని మరోసారి చాటుకుంది. ఇప్పటికే ఈ సంస్థ తన పౌండేషన్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరో ముందడుగు వేసి బడ్డి4స్టడీ అనే మరో ఫౌండేషన్ తో కలిసి ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల చదువుల ఖర్చుల నిమిత్తం స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కాలర్ షిప్ కు ఎవరు అర్హులు అంటే? 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కీమ్ కు అర్హులు. వారికి సంవత్సరానికి రూ. 15,000 వేల రూపాయలను స్కాలర్ షిప్ కింద అందించనున్నారు. ఇక ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 15, 2022 చివరి తేదిగా పౌండేషన్ తెలిపింది. ఈ మంచి అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు ఉపయోగించుకోవాలని వారు తెలిపారు. ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి మరిన్ని వివరాలు మీ కోసం.. కింద తెలిపిన అర్హతలు ఉన్న విద్యార్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
స్కాలర్ షిప్ పొందటానికి అర్హతలు:
దరఖాస్తు చేయడానికి కావల్సిన పత్రాలు:
SBI Foundation, in partnership with Buddy4Study India Foundation, is pleased to announce the SBI Asha Scholarship Program.
Registration Link👉 https://t.co/JwPxe44duY#SBIF #SBIFoundation #SBIFILM #Community #Education #Change #Impact #India #scholarships #ScholarshipProgram pic.twitter.com/Cyu498NfkS
— SBI Foundation (@SBI_FOUNDATION) September 5, 2022