ఓలా, ఉబెర్, ర్యాపిడో.. ఈ పేర్లు సిటీలలో ఉండేవారికి బాగా పరిచయమే. అసలు ఇవి లేకపోతే చాలామంది పనులు ఆగిపోతాయనే చెప్పాలి. ఎందుకంటే అందరూ మెట్రోలు, ఎంఎంటీఎస్‌లు, రైళ్లలో వెళ్లాలి అంటే అవ్వకపోవచ్చు. కొందరికి అంత ఓపిక కూడా ఉండకపోవచ్చు. కావాలంటే ఒక రూపాయి పోయినా కంఫర్ట్ మిస్ కాకూడదు అనుకుంటారు. ఇంకొందరు అయితే వారి ప్రాంతానికి బస్సు సర్వీసులు లేకపోతే తప్పుకుండా ఇలాంటి రైడింగ్ యాప్లను ఆశ్రయించాల్సిందే. కరోనా తర్వాత కాస్త ఈ సర్వీసులు తగ్గినా క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. కానీ, గత కొద్ది రోజులుగా వీళ్లు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆటోలపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రవణా శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాంతో ఓలా, ఉబెర్, ర్యాపిడీ ఆటో సర్వీసులు మూడ్రోజుల్లో నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇదంతా జరిగింది తెలుగురాష్ట్రాల్లో కాదులెండి.. బెంగళూరులో. బెంగళూరు ఐటీ హబ్ అందరికీ తెలిసిందే. అక్కడ రోజులో రవాణా కోసం తప్పకుండా ఇలాంటి రైడింగ్ యాప్స్ మీద ఆధారపడాల్సిందే. అయితే కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఓలా, ఉబెర్, ర్యాపిడో సంస్థలు ఛార్జీలను విపరీతంగా పెంచేశాయి. రెండు కిలోమీటర్ల దూరంకూడా లేకుండానే రూ.100 ఛార్జ్ చేస్తున్నాయి. వీళ్ల తీరు చూసి విసిగిపోయిన వినియోగదారులు కర్ణాటక రవాణా శాఖకు ఫిర్యాదు చేశారు. ప్రజల ఫిర్యాదులను పరిశీలించిన రవాణా శాఖ ఓలా, ఉబెర్, ర్యాపిడో మూడ్రోజుల్లోగా వారి ఆటో రిక్షా సర్వీసులను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వారిపై వస్తున్న ఫిర్యాదులకు నివేదిక సైతం సమర్పించాలంటూ కోరారు.
ola uber autos are banned in bengaluru which means the rides that we weren’t able to book before will not be available for booking anymore
— vishal dayama (@VishalDayama) October 7, 2022
కర్ణాటకలో రవాణా శాఖ నిబంధనల ప్రకారం రెండు కిలోమీటర్లకు కేవలం రూ.30 మాత్రమే వసూలు చేయాలి. కానీ, ఓలా- ఉబెర్- ర్యాపిడో వంటి సంస్థలు రెండు కిలోమీటర్లు కూడా లేకపోయినా రూ.100 ఛార్జ్ చేస్తున్నారు. అయితే క్యాబ్‌ల విషయంలో మాత్రం ఎలాంటి నిషేదం విధించలేదు. నిజానికి కర్ణాటక ప్రభుత్వం 2016లో కొన్ని రూల్స్, లైసెన్సులు తీసుకొచ్చింది వాటి ప్రకారం క్యాబ్‌లకు మాత్రమే లైసెన్సులు ఇస్తున్నారు. కానీ, ఆటోలు వాటి కిందకు రావంటూ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆటో డ్రైవర్లు, యూనియన్లు సైతం తప్పుబట్టడం లేదు. ఎందుకంటే అగ్రిగేటర్లు రేట్లు పెంచడం ద్వారా వారికి వచ్చే గిరాకీలు తగ్గినట్లు చెబుతున్నారు. మరోవైపు ఆటోరిక్షా డ్రైవర్స్ యూనియన్, నందన్ నిలేకనికి చెందిన బెకన్ ఫౌండేషన్ బెంగళూరులో కొత్త యాప్ లాంఛ్ చేస్తోంది. నమ్మ యాత్రి యాప్‌ని తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం నిబంధనలకు తగ్గట్లుగానే ఆటోలు నడిపిస్తామంటూ చెప్పుకొచ్చారు.
What’s with banning @Olacabs @Uber @rapidobikeapp Autos in Bengaluru ? Is the @BBMPCOMM unaware that what they are calling unaffordable is actually the only affordable Auto option in #Bengaluru ! Do they have any idea how much less is @Ola_Bangalore auto compared to local autos !
— Rohit Biswas (@bomngali) October 7, 2022