దేశంలో ప్రతి ఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అన్న రోజులివి. ప్రభుత్వ పథకాలు అందాలన్నా లేక పెద్ద మెుత్తంలో చెల్లింపులు చేయాలన్నా బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అయితే చాలా మందికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆయా ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సి రావటమే. మినిమం బ్యాలెన్స్ లేదంటే బ్యాంకులు జరిమానాల మీద జరిమానాలు వేస్తుంటాయి. అయితే రానున్న రోజుల్లో ఈ సమస్య తొలగిపోనున్నట్లు తెలుస్తోంది. ఈ పెనాల్టీలను మాఫీ చేయటంపై సదరు బ్యాంకుల బోర్డులు నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కిషన్‌రావ్ కరాద్ స్పష్టం చేశారు.
సాధారణ మధ్య తరగతి ప్రజలకు మినిమం బ్యాలెన్స్ అన్నది కూడా ఒక సమస్యే. ఒక్కోసారి ఆ డబ్బులను అత్యవసర పనులకు వాడుకుంటుంటారు. ఇలాంటి సమయాల్లోనూ బ్యాంకులు పెనాల్టీ విదిస్తుంటాయి. అలా ఏడాది పాటు ఖాతా కొనసాగించామంటే.. ఆ జరిమానా వేలల్లో ఉంటోంది. చివరకి ఆ పెనాల్టీ చెల్లించలేక.. సదరు బ్యాంకు ఖాతా వాడలేక నిరుపయోగంగా మారుతున్నాయి. అయితే.. భవిష్యత్తులో అంతా సవ్యంగా సాగితే.. ఇకపై బ్యాంక్ అకౌంట్‌లో ఇక మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాల్సిన పనిలేదట. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగ్‌వత్ కిషన్‌రావ్ కారడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తంలో నగదు మెయింటెయిన్ వారిపై పెనాల్టీ విధించాలని బ్యాంకులకు కేంద్రం ఏమైనా సూచలను చేస్తుందా? అన్న ప్రశ్నకు.. మంత్రి, బ్యాంకులు ఇండిపెండెంట్ బాడీలని, ఖాతాలో మినిమం బ్యాలెన్స్ రద్దు చేసే అధికారం బ్యాంకుల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేతిలో ఉంటుందని తెలిపారు. బ్యాంకులు ఖాతాదారులకు నిర్థేశించిన కనీస మెుత్తాన్ని ఖాతాల్లో ఉంచకపోయినప్పటికీ ఎటువంటి పెనాల్టీ చేయకుండా కేంద్రం త్వరలోనే బ్యాంకులకు ఆదేశాలు జారీకి పరిశీలన జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం మంత్రి భగ్‌వత్ కిషన్ రావ్ వివిధ ఆర్థిక పథకాలను జమ్ముకశ్మీర్ ప్రజలకు చేరువ చేసే చర్యల్లో భాగంగా అక్కడ పర్యటిస్తున్నారు.
బ్యాంకులు తమ రూల్స్ ప్రకారం.. ఖాతాదారులు తప్పనిసరిగా కొంత మెుత్తాన్ని ఎల్లప్పుడూ ఖాతాలో ఉంచాలని సూచిస్తుంటాయి. ఇది వివిధ బ్యాంకులకు వేరువేరుగా ఉంటుంది. బ్యాంక్ ఉన్న ప్రాంతాన్ని బట్టి కూడా ఇందులో మార్పు ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకుల్లో రూ. 1,000 నుంచి రూ. 3,000 దాకా ఉంటే.. ప్రైవేటు బ్యాంకుల్లో రూ.5,000 నుంచి రూ. 10,000 దాకా కూడా ఉంటుంది. వీటిని సరిగా నిర్వహించని పక్షంలో సదరు బ్యాంకులు ఖాతాదారునిపై పెనాల్టీ విధిస్తుంటాయి. ఈ సమస్య ఎక్కువుగా.. ఒకటి కంటేఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నపుడు ఎదురవుతుంటుంది. కావున వినియోగించని ఖాతాలను మూసివేయటం ఉత్తమం.
The boards of individual banks can decide on waiving the penalty on accounts, which do not maintain a minimum balance, Union Minister of State for Finance Bhagwant Kishanrao Karad on Wednesday said. https://t.co/iTvI5jTvF8
— Economic Times (@EconomicTimes) November 23, 2022