స్వీడన్ కు చెందిన ప్రముఖ ఫర్నిచర్ సంస్థ ఐకియా గురించి తెలియని వారుండరు. ఐకియా బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనిక వర్గాల్లో ఈ సంస్థ ఉపకరణాలు బాగా పాపులర్ అయ్యాయి. భారతదేశంలో తన తొలి అతి పెద్ద స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకి ప్రపంచ వ్యాప్తంగా అనేక స్టోర్లు ఉన్నాయి. అయితే రష్యాలో ఉన్న తన స్టోర్లను మూసేస్తున్నట్లు ఐకియా సంస్థ తాజాగా ప్రకటించింది.
రష్యా, ఉక్రెయిన్ పై గత కొన్ని రోజులుగా యుద్ధం చేసున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో వలన భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ యుద్ధం విషయంలో ప్రపంచ దేశాలని రష్యాను తప్పుబడుతున్నాయి. రష్యా అహంకార ధోరణితో ఉక్రెయిన్ పై దాడి చేస్తుందని అమెరికాతో పాటు యూరప్ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇదే సమయంలో పలు దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధించాయి. తాజాగా రష్యా చర్యలను ఖండిస్తూ అక్కడ ఉండే తన స్టోర్లులను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు ఐకియా కంపెనీ ప్రకటించింది. “ఈ దాడి వల్ల రెండు దేశాలపై పెద్ద మొత్తంలో ప్రభావం చూపుతోంది. సప్లయ్ చెయిన్‌కి తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.
ట్రేడింగ్ పరిస్థితులు దెబ్బతిన్నాయి. ఈ కారణంతోనే రష్యాలో ఐకియా కార్యకలాపాలను కొన్ని రోజులు పాటు నిలిపివేయాలని కంపెనీ గ్రూప్‌లు నిర్ణయించాయి” అని బ్రాండ్ ఓనర్ ఇంటర్ ఐకియా, స్టోర్ ఓనర్ ఇంగ్కా గ్రూప్‌లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇప్పటికే పలు ఆటో కంపెనీలు రష్యాతో కటీఫ్ చెప్పాయి. వాహనాలను రష్యాకు ఎగుమతి చేయమంటూ ప్రకటించాయి. తాజాగా ఈ ఫర్నిచర్ దిగ్గజం కూడా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఐకియా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.